Live: చంద్రబాబు కేసు అప్‌డేట్స్.
చంద్రబాబు : ఏ కోర్టు? ఏ కేసు? ఏం స్టేటస్.?
సుప్రీంకోర్టు : బాబు స్పెషల్ లీవ్ పిటిషన్, రేపు ఏ బెంచ్ అన్న నిర్ణయం
హైకోర్టు : కస్టడీ వద్దన్న క్వాష్ పిటిషన్ డిస్మిస్
ACB కోర్టు : కస్టడీ, బెయిల్ పిటిషన్లపై రేపు వాదనలు
ACB కోర్టు : అధికారుల కాల్‌డాటా కావాలన్న కేసులో వాదనలు
చంద్రబాబుకు సింపతీ డ్రామాపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు
ఇది వాళ్లకు కొత్తేం కాదు
డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ
ఆ పార్టీ పునాదులే దోపిడీపైన ఏర్పడ్డాయి.
చంద్రబాబు పనులకు అక్షింతలు వేసిన కాగ్
అమరావతి రాజధాని ప్లాన్‌పై కాగ్ సంచలన నివేదిక
► CRDA వల్ల రాష్ట్రం పై భారీ ఆర్థిక భారం
► వర్తమానంతో పాటు భవిష్యత్తులో కూడా CRDA వల్ల ఆర్థిక భారమే
► నిపుణుల కమిటీ సిఫార్సులను నాడు చంద్రబాబు సర్కారు పరిగణనలోకి తీసుకోలేదు
► మాస్టర్ ప్లాన్స్ తయారీ కాంట్రాక్ట్‌లను నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసారు
► సలహాదారు సంస్థలకు నామినేషన్లపై రూ.28 కోట్లు ఇవ్వడం తప్పు
► నిబంధనలకు విరుద్ధంగా ప్రజా వేదిక నిర్మించారు
అమవాస్య చీకటిలో తెలుగుదేశం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్
► చంద్రబాబు అరెస్ట్‌తో అశాంతిని సృష్టించి లాభం పొందాలని ప్రతిపక్షం ప్రయత్నించింది
► బలహీన వర్గాలను అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
► టీడీపీ పార్టీ బీసీలకు క్షమాపణ చేయాలి
► అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి ఇచ్చాడే కానీ కనీస గౌరవం లేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు
► అచ్చెన్నాయుడు పనికిరాడనే పవన్‌ను తెచ్చుకున్నట్టున్నాడు
► చంద్రబాబు నాయకత్వానికి చీకటి రోజులు వచ్చాయి
► అమావాస్య చీకటిలో టీడీపీ కూరుకుపోయింది
► లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు : అచ్చెన్నాయుడు
► సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ మాట్లాడుతున్నారు
► నేషనల్ మీడియాకు చెప్పేందుకు లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు
► లోకేష్‌కు అరెస్ట్ అంటే భయమేమీ లేదు
► నన్ను కూడా అరెస్ట్ చేసినా భయమేమీ లేదు
► నాకు కూడా కేసులు, అరెస్ట్‌లు కొత్త కాదు
ములాఖత్ ముగిసింది
► చంద్రబాబుతో ముగిసిన కుటుంబసభ్యుల ములాఖత్
► సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో సమావేశం
► బాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు సమావేశం
► కోర్టులో వాదనలు, ఇప్పుడున్న పరిస్థితులు వివరించిన బృందం
కేసులు ఇవి, స్టేటస్ ఇది
► జైల్లో చంద్రబాబుకు బ్రీఫింగ్ ఇవ్వనున్న కుటుంబ సభ్యులు
► రిమాండ్ తర్వాత చంద్రబాబును మూడోసారి కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి
► లోకేష్ ఢిల్లీలో చేపట్టిన లాయర్ల కన్సల్టేషన్ గురించి వివరించనున్న కుటుంబ సభ్యులు
► జనసేన నేతలతో జరిగిన చర్చల గురించి చంద్రబాబుకు వివరించనున్న కుటుంబ సభ్యులు
రాజమండ్రి జైల్లో బాబుతో ములాఖత్‌కు అచ్చెన్నాయుడు
► చంద్రబాబును కలిసేందుకు జైలుకు వచ్చిన భువనేశ్వరీ, బ్రాహ్మణి
► బాబు కుటుంబ సభ్యులతో పాటు జైలుకు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి
► పార్టీ సీనియర్ నేతలతో వరుసగా బాబు మంత్రాంగం
► ఇటీవలే జైల్లో యనమలతో ములాఖత్ అయిన చంద్రబాబు
► అనుమతి లేకపోవడంతో జైలు బయటే ఆగిపోయిన ప్రత్తిపాటి
ACB కోర్టులో బాబు పిటిషన్ల హోరు
► సాంకేతిక కారణాల కోసం బాబు లాయర్ల తాపత్రయం
► అరెస్ట్ సమయంలో CID అధికారుల కాల్ డాటా కావాలంటూ పిటిషన్
► తన అరెస్ట్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలొచ్చాయంటూ పిటిషన్
► కాల్ రికార్డులు ఇవ్వాలంటూ రిమాండ్ సమయంలోనూ లూథ్రా విజ్ఞప్తి
► కాల్ రికార్డుల కేసులో వాదనలు వినిపిస్తోన్న బాబు లాయర్లు
ACB కోర్టులో విచారణ రేపటికి వాయిదా
► చంద్రబాబుకు సంబంధించి వరుస పిటిషన్లు
► కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగానే బెయిల్ పిటిషన్
► బెయిల్ పిటిషన్‌పైనే వాదనలు జరపాలని పట్టుబట్టిన బాబు లాయర్లు
► ఏ అంశంపై విచారణ చేపట్టాలో రేపు తేలుస్తామని చెప్పిన కోర్టు
► అవసరమయితే రెండు పిటిషన్లను ఏకకాలంలో విచారణ చేపడుతామన్న కోర్టు
రూల్స్ ఏం చెబుతున్నాయి? కస్టడీనా? బెయిలా?
► CRPC ప్రకారం ముందు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటున్న లాయర్లు
► జడ్జి ఏ అంశంపై విచారణ జరపాలో చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడం సరికాదంటున్న లాయర్లు
► కస్టడీ అంశంపై వాదనలు పూర్తి కాగానే బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినడం సబబు అంటోన్న లాయర్లు
► కస్టడీపై నిర్ణయం వచ్చిన తర్వాతే ఏ కోర్టయినా బెయిల్‌పై వాదనలు వింటుందంటున్న లాయర్లు
షెల్ కంపెనీలకు డైరెక్టర్లుగా తమ్ముళ్లే : CID
► బాబు సృష్టించిన షెల్ కంపెనీకి డైరెక్టర్లంతా బాబు అనుచరులే
► షెల్ కంపెనీ ఖాతాల నుంచి బాబు చెప్పిన ఖాతాలకు డబ్బు రూటింగ్
► ఆధారాలు చూపించి ప్రశ్నలడిగినా బాబు నోరు మెదపట్లేదు
► విచారణలో ఏ రకంగా సహకరించడం లేదు
► చంద్రబాబుతో సహా అచ్చెన్నాయుడు, ఘంటా సుబ్బారావు, డా.లక్ష్మీనారాయణ పాత్రలపై ఆధారాలున్నాయి
► ఈ ఆధారాలను చూపించి కుట్ర కోణం అడిగితే.. చంద్రబాబు నోరు మెదపట్లేదు
ఖాతాల్లోకి వచ్చిన కోట్లు ఎక్కడివి?
► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం
► నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి CID దగ్గర పక్కా ఆధారాలు
► 2014-18 మధ్య స్కిల్ కుంభకోణం
► 2018 నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కౌంట్లకు తరలివచ్చిన భారీగా నిధులు
► ఈ అక్కౌంట్లు అన్నింటికీ సంతకం హోదా ఉన్నది చంద్రబాబుకే
► పార్టీకి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా, హైదరాబాద్ జోన్ ఖాతాలో భారీగా డిపాజిట్లు
► వాటి లెక్క చెప్పేందుకు నిరాకరించిన చంద్రబాబు
మహిళల్లో శక్తి ఉంది, దేన్నయినా నడిపించగలరు : భువనేశ్వరీ
► టిడిపి నాయకత్వంపై చర్చ జరుగుతున్న సమయంలో భువనేశ్వరీ కీలక వ్యాఖ్యలు
► దేవుడు ఉన్నాడు, నన్ను ముందుకు నడిపించగలడు
► మగవాళ్ల కంటే ఆడవాళ్లే బాగా నడిపించగలరని నమ్ముతున్నాను
► మనలో దుర్గాదేవీ శక్తి ఉంది, ఝాన్సీ రాణీ పట్టుదల ఉంది
► నాకు పెళ్లయిన కొత్తలో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు
► కేవలం మూడు నెలల్లో సంస్థను నడిపించడం నేర్చుకున్నాను
► మహిళలు కుటుంబాన్నే కాదు, దేన్నయినా నడిపించగలరు
చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్
► ఏపి హైకోర్టులో శనివారం దాఖలైన చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్
► చంద్రబాబు సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయిన క్వాష్ పిటిషన్
► ఇప్పటికే కస్టడీ ముగిసినందున అర్హత కోల్పోయిన పిటిషన్
► నేడు విచారణకు వచ్చిన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు
చంద్రబాబు సామ్రాజ్యం విలువ ఎంత? : YSRCP
► జగ్గంపేటలో తమ వ్యాపార సామ్రాజ్యం గురించి వెల్లడించిన భువనేశ్వరీ
► మా కంపెనీలో మాకున్న వంద శాతం షేర్లలో 2% అమ్ముకుంటే రూ.400 కోట్లు
► భువనేశ్వరీ లెక్క ప్రకారం 1%=రూ.200 కోట్లు, 100%=రూ.20వేల కోట్లు
► ఈ లెక్కన కేవలం హెరిటేజ్‌లో చంద్రబాబు కుటుంబానికి ఉన్న షేర్ల విలువ రూ.20వేల కోట్లు.!
► ఇవీ కాక, మెట్రో నగరాల్లో, దేశ విదేశాల్లో వందలాది ఎకరాలు, వేల కోట్ల విలువ చేసే ఇతర ఆస్తుల విలువ ఎంత?
► హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఇంటి విలువ ఎంత? మదీనాగూడ 14 ఎకరాల ఫాంహౌజ్ విలువ ఎంత?
► ఎన్నికల సంఘం లెక్కల్లో ఎన్ని ఆస్తులు చూపించారు? ఎంత విలువ కట్టారు?
రంగంలోకి భువనేశ్వరీ, బ్రాహ్మణి
► లోకేష్ ఇప్పట్లో ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం లేదా.?
► గత పది రోజులుగా ఢిల్లీకే పరిమితమయిన లోకేష్
► లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవడంతో పార్టీ నేతృత్వంపై చర్చ
► గత కొద్ది రోజులుగా బ్రాహ్మణి రావాలని ఎల్లో మీడియా డిమాండ్
► బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమయిందంట సంపాదకీయాలు
► బ్రాహ్మణి ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ ఎల్లో మీడియా ప్రత్యేక డిబేట్
► దానికి తగ్గట్టుగానే బ్రాహ్మణి, భువనేశ్వరీ కార్యాచరణ ప్రణాళిక
► నిన్నంతా రాజకీయ సమావేశాలు నిర్వహించిన బ్రాహ్మణి
► పొత్తులో భాగంగా జనసేన నాయకులతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై బ్రాహ్మణి చర్చలు
► ఇవ్వాళ జగ్గంపేట ఆందోళనల్లో పాల్గొన్న భువనేశ్వరీ
► భవిష్యత్ పార్టీ పగ్గాల విషయంలో ఎల్లోమీడియా డైరెక్షన్‌లో టిడిపికి స్పష్టత ఇస్తోన్న బ్రాహ్మణి, భువనేశ్వరీ
► చంద్రబాబు ఔట్ సోర్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని YSRCP విమర్శలు
చంద్రబాబు కస్టడి పొడిగించండి : CID పిటిషన్
► విజయవాడ ACB కోర్టులో సీఐడీ పిటిషన్
► సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించలేదు
► మొదటి రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించ లేదు
► అందుకే మరో 3 రోజులు కస్టడీ పొడిగించాలని కోరుతున్నాము
► కేసు ఇప్పుడు కీలక విచారణ దశలో ఉంది
► కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై మా వాదనలు వినాలి : CID
► పోలీస్ కస్టడీ పిటిషన్‌పై మెమో ఫైల్ చేయాలని CIDకి జడ్జి ఆదేశం
► ముందు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాలి : చంద్రబాబు లాయర్లు
► కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తవగానే బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామన్న కోర్టు
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment