Ys Viveka Murder Case: అవినాష్ రెడ్డికి ఊహించని షాకిచ్చిన సీబీఐ..మరోసారి సమన్లు..ఎందుకంటే?
Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని సీబీఐ వదలడం లేదు. ఈ కేసులో ఇప్పటికే అనేకసార్లు అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని విచారించిన
Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని సీబీఐ వదలడం లేదు. ఈ కేసులో ఇప్పటికే అనేకసార్లు అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని విచారించిన సీబీఐ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది. ఇక తాజాగా అవినాష్ రెడ్డికి సీబీఐ (CBI) మరోసారి సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టులో హాజరుకావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ (CBI) అందులో అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల పేర్లను పేర్కొంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని కోర్టు ముందుకు రావాలని సీబీఐ (CBI) ఆదేశించింది. కాగా ఈ కేసులో అవినాష్ రెడ్డి (Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టు ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఇక ఈ కేసులో నిందితులను సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచింది. ఇందులో భాస్కర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. కానీ అప్రూవర్ గా మారిన దస్తగిరి మాత్రం కోర్టుకు రాలేదు. దీనితో ఆయన ఆబ్సెంట్ పిటీషన్ దాఖలు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను ఆగష్టు 14కి వాయిదా వేసింది కోర్టు. కోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని కూడా ఆగస్టు 14న కోర్టుకు రావాలని సీబీఐ (CBI) సమన్లు ఇచ్చింది.
కాగా ఇటీవల అవినాష్ రెడ్డి (Avinash Reddy)కి ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు కొన్ని షరతులను విధించింది. ఈ షరతుల్లో ప్రతి శనివారం సీబీఐ ముందు హాజరు కావాలన్న కోర్టు..సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని సూచించింది. దీనితో నేడు అవినాష్ (Mp Avinash Reddy) సీబీఐ ముందుకు వచ్చారు. ఇక ఈ షరతుల్లో సీబీఐ విచారణకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:15 నిమిషాల మధ్య హాజరుకావాలని సూచించింది. జూన్ 19 వరకు కూడా సీబీఐ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే రూ.5 లక్షల పూచీకత్తుతో రెండు షూరిటీలను కోరింది కోర్టు. దీనితో శనివారం సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి (Avinash Reddy) హాజరవుతున్నారు.
కాగా ఈ హత్య కేసులో ఇప్పటివరకు అవినాష్ (Mp Avinash Reddy) కేవలం ఆరోపణలు ఎదుర్కొంటుండగా..సీబీఐ ఎప్పుడు కూడా నిందితుల జాబితాలో ఆయన పేరును చేర్చలేదు. కానీ అనూహ్యంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటీషన్ విచారణ సందర్బంగా అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) A8 అని కోర్టుకు సీబీఐ చెప్పడం సంచలనంగా మారింది. వివేకా హత్యకు కుట్ర, సాక్షాల చెరిపివేతలో అవినాష్, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ కౌంటర్ లో ఆరోపించింది.
అంతేకాదు ఈనెల 3న వైఎస్ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) ని ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసి ఆ తరువాత కొద్దిసేపటికే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల మొదటివారంలో సీబీఐ విచారణకు వచ్చిన అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) ని ఆ సమయంలోనే అరెస్ట్ చేయడం..విడుదల చేయడం జరిగిపోయాయి. కానీ ఇది జరిగిన వారం రోజులకు బయటకు రావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆగస్టు 14న ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment