TSPSC Group 3 Exam: టీఎస్పీఎస్సీ గ్రూప్ 3.. ఆ రోజే పరీక్ష..!
తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేరుస్తూ టీఎస్పీఎస్సీ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో మొత్తం ఉద్యోగాల సంఖ్య 1388కి చేరింది.

తొలుత 1363 పోస్టులతో టీఎస్పీఎస్సీ గత సంవత్సరం డిసెంబర్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని రోజులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులు అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టులు 1,375కి పెరిగాయి

తాజాగా నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించగా.. వీటిని గ్రూప్ 3 కేటగిరీలో చేర్చారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,388కి చేరింది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష తేదీని ప్రకటించలేదు

అయితే గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29, 30వ తేదీన నిర్వహించనుండగా.. గ్రూప్ 3 పరీక్షను అక్టోబర్ లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

టీఎస్పీఎస్సీ ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్లలో జేఎల్ (జూనియర్ లెక్చరర్స్) ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు అక్టోబర్ మొదటి వారం వరకు ఉన్నాయి. దీంతో అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో ఈ గ్రూప్ 3 పరీక్షను నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది

అయితే ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మూడు పేపర్లకుగానూ 450 మార్కులకు గ్రూప్ 3 రాత పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఈ పరీక్షా పత్రం ఉంటుంది

No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment