ITR Filing:
ఆధార్‌తో పాన్ లింక్ చేయలేదా..? ఐటీఆర్ ఫైలింగ్ చేయాలంటే రూ.6 వేలు కట్టాల్సిందే
Aadhaar Pan Link
ITR Filing:
ఆధార్‌తో పాన్ లింక్ చేయని వారికి ఐటీఆర్ ఫైలింగ్ అదనపు భారంగా మారింది. ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాలంటే మరో రూ.6 వేలు చెల్లించుకోవాల్సిందే. అదెలాగో చూద్దాం.
Bank Account:
కస్టమర్లకు తెలియకుండా డబ్బులు కట్... మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేయండి
పాన్ కార్డ్ వివరాల్లో తప్పులు ఉన్నాయా? ఆన్‌లైన్‌లో ఇలా కరెక్ట్ చేసుకోండి
లోన్ అప్లై చేస్తున్నారా? అగ్రిమెంట్‌పై సంతకం చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలివే..
ఆధార్‌తో పాన్ కార్డు నంబర్‌ను లింక్ చేసుకోవాలని గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. జూన్ 30తో లింక్ గడువు ముగిసిపోయింది. గతంలో రెండు, మూడు సార్లు ఈ గడువును ప్రభుత్వం పెంచినా ఈ సారి మాత్రం పెంపు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు చెల్లుబాటు కావు. ఇకపై వీరికి కొన్ని సేవలు అందవు. కొన్ని సర్వీసులను వాడాలంటే పాన్ నంబర్ తప్పనిసరిగా కావాలి. అందులో కీలకమైనది ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్. అయితే, ఆధార్‌తో పాన్ లింక్ చేయని వారికి ఐటీఆర్ ఫైలింగ్ అదనపు భారంగా మారింది. ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాలంటే మరో రూ.6 వేలు చెల్లించుకోవాల్సిందే. అదెలాగో చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులను జులై 1 నుంచే ఇన్‌యాక్టివ్ చేసింది. కాబట్టి ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయాలంటే వ్యక్తిపై మరింత భారం పడుతుంది. దీంతో ఇప్పుడు పాన్ కార్డును యాక్టివేట్ చేసుకోవాలంటే పెనాల్టీ చెల్లించాలి. అనంతరం ఆ పాన్ కార్డు యాక్టివేట్ కావడానికి 30 రోజులు పడుతుంది. మరోవైపు, ఐటీఆర్ ఫైలింగ్‌కి తుది గడువుగా జులై 31ని ప్రకటించింది. దీంతో గడువు పూర్తి కావడానికి నెల రోజుల కన్నా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. అంటే, లేట్ ఫీజు చెల్లించి ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి వస్తుంది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment