Breaking

Search Here

11 July 2023

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటీషన్ విచారణలో సుప్రీంకోర్టు ట్విస్ట్

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటీషన్ విచారణలో సుప్రీంకోర్టు ట్విస్ట్..!

MLC Kavitha: 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) దాఖలు చేసిన పిటీషన్ విచారణలో సుప్రీంకోర్టు  (Supreme Court) ట్విస్ట్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన కౌల్ అందుబాటులో లేని కారణంగా విచారణను వాయిదా వేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. అయితే వాయిదా పడిన విచారణ తేదీల్ని త్వరలో వెల్లడిస్తామని కోర్టు  (Supreme Court) పేర్కొంది.

ఈడీ (Enforcement Directorate) తనకు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని..అలాగే తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటీషన్ లో ఆమె పేర్కొన్నారు. కాగా గతంలో కవిత (Kalvakuntla Kavitha) ను విచారించిన ఈడీ  (Enforcement Directorate) ఆమె దగ్గరి నుంచి కీలక పత్రాలు, పలు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

కాగా లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత  (Kalvakuntla Kavitha) మూడు సార్లు విచారణకు హాజరయ్యారు. ఈనెల 11న తొలిసారి ఆమె ఈడీ విచారణకు హాజరవ్వగా..సుమారు 8 గంటలకు పైగా అధికారులు విచారించారు. ఆ తరువాత నిన్న కూడా సుమారు 10 గంటల పాటు కవితను ప్రశ్నించారు. ఇక ఈరోజు కూడా 10 గంటలు కవిత (Kalvakuntla Kavitha) పై ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం 30 గంటల పాటు ఈడీ అధికారులు కవితను విచారించారు.

Telangana: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం..తానా సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు


ఇప్పటికే 3 సార్లు ఈడీ ముందుకు వచ్చిన కవిత  (Kalvakuntla Kavitha) గత ఏడాదికాలంగా వాడిన 10 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అధికారులు ఆ 10 ఫోన్లలో డేటాను తీసే పనిలో నిమగ్నమయ్యారు. కవిత లాయర్ సోమా భరత్ సమక్షంలో గత 2 రోజుల నుంచి ఫోన్లను ఓపెన్ చేసి అందులో డేటాను..అలాగే డిలీట్ చేసిన డేటాను రిట్రీవ్ చేస్తున్నట్లు ఈడీ  (Enforcement Directorate) వర్గాల సమాచారం. ఇక ఇందుకోసం సాంకేతిక ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కవిత సమర్పించిన ఫోన్లలో డేటాను సేకరించిన అనంతరం దానిని విశ్లేషించి షాని ఆధారంగా కవిత  (Kalvakuntla Kavitha) విచారణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఈడీ  (Enforcement Directorate) వర్గాలు తెలిపాయి. మరి కవిత పిటీషన్ పై విచారణ ఏ రోజు జరుపుతారో చూడాలి.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments