TTD: మ్యాను స్క్రిప్ట్ చేసిన తాళపత్రాలపై టీటీడీ ఎలాంటి పరిశోధనలు చేయనుంది
యాంత్రిక యుగానికి మునులు., మహర్షలు., పూర్వికులు తమ మేధాశక్తితో రచించిన గ్రంధాలూ సంజీవనిగా మారుతున్నాయి. అంతుచిక్కని వ్యాధులు., కంటికి కనపడని కీటకాలను హరించేందుకు ఎంతో వైజ్ఞానభరితమైన రచనలు., సూచనలు., వ్యాధి నివారణ ఔషధాలు తాళపత్రాలలోనే నిక్షితం చేసారు పూర్వికులు. ఇంగ్లీష్ మెడిసిన్ తో నయం కానీ ఎన్నో వ్యాధులు ఆయుర్వేదంతో నయమవుతున్నాయి. అందుకే తాళపత్ర గ్రంధాలను జాతి సంపదగా పరిగణిస్తున్నాం. భావి తరాలకు అందించే ప్రయత్నం చేస్తోంది టీటీడీ (TTD). ఇలా తర్జుమా చేసిన వాటిని పుస్తక రూపంలో తేవడానికి ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రతిపాదనలు టీటీడీ చేస్తోంది. ప్రస్తుతం టీటీడీ వద్ద గల తాళపత్రాలు మ్యాను స్క్రిప్టు అయిన అనంతరం పుస్తకాల రూపంలో వివిధ భాషల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
ముఖ్యంగా టీటీడీ వద్ద ఉన్న తాళపత్ర గ్రంధాల్లో అశ్వ చికిత్స, పశుచికిత్సకు సంబంధించినవి ఉన్నాయి. ఇక ఆయుర్వేదానికి సంబంధించిన అనేక తాళపత్రాలు లభ్యం అయ్యాయి. పంటలు సుభిక్షంగా ఎలా పండించాలి..? ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనే గ్రంధాలూ ఉన్నాయి. రత్న శాస్త్రానికి సంబంధిన అనేక తాళపత్రాలు ఉన్నాయి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన తాళపత్రాలు మ్యాను స్క్రిప్టింగ్ దశలో ఉన్నాయి.
శ్రీవారి ఆలయ శుద్ధికి ఏయే పదార్థాలు వినియోగిస్తారో తెలుసా..?
జ్యోతిష్య శాస్త్రం., అందులోని అనేక భాగాలకు ఆంభంధించిన గ్రంధాలూ సైతం తాళపత్రంలో నిక్షిప్తం అయ్యాయి. మానవ జీవన విధానం ఎలా ఉండాలి.... నీతితో ఎలా జీవించాలనే శాస్త్రాలు అనేకం చెప్తున్నాయి. ఈ తాళపత్రాలపై డిప్లమా కోర్సులు ., సర్టిఫికెట్ కోర్సులు సైతం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. వివిధ భాషల్లో తాళపత్రాలపై స్క్రిప్టింగ్ ఉంటుంది. ఒక్కో భాషలో ఒక్కొక్కరికి ప్రావిణ్యం ఉంటుంది. సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రావిణ్యం ఉన్న పండితులు., విద్యార్థుల చేత అనువాద ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment