ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్నది ప్రతి ఒక్కరి కల. దీని కోసం ఎంతో కష్టబడి చదువుతుంటారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అనేక రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తుంటాయి. ప్రతి రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. కానీ కొంతమంది అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు ఎంపిక అవుతుంటారు. అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు మరియు ఇంటర్వ్యూలకు వివిధ మార్గాల్లో సిద్ధమవుతారు. అయితే మెరుగైన వ్యూహంతో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మాత్రమే పరీక్ష మరియు ఇంటర్వ్యూలలో విజయం సాధించగలరు. ముఖ్యంగా పరీక్షా విధానం, ఎంపిక ఎలా ఉంటుందో తెలియక చాలా మంది తికమక పడుతుంటారు.. అలాంటి వారి కోసం న్యూస్ 18 ఐబీపీఎస్ నిర్వహించే పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందో వివరించే ప్రయత్నం చేస్తుంది.
తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ ఉద్యోగాల భర్తీకి ఐబిపిఎస్ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది.ఇందులో దేశవ్యాప్తంగా 4045 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొంది. కేవలం డిగ్రీ అర్హతతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే చాలా మంది అభ్యర్థులు డిగ్రీ అర్హతతో ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలు అనగానే అందరూ దరఖాస్తు చేసుకుంటారు. కానీ దాని పరీక్ష విధానం, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందో చాలామందికి అవగాహన లేకపోవడంతో నిరాశ చెందుతూ ఉంటారు.
ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే
ఈ ఉద్యోగాలలో తెలంగాణలో 27 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు తక్కువ ఉద్యోగాలు ఉన్నాయని అధైర్య పడాల్సిన పని లేదు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వారి వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు అయితే రూ.1075 , ఇతరులు అయితే 1850 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 21వ తారీకు.. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్స్ పరీక్ష కూడా అక్టోబర్ నెలలో ఉంటుంది
పరీక్ష విధానం ఎలా ఉంటుంది.
ఐబీపీఎస్ క్లారికల్ పరీక్ష విధానం రెండు దశలలో ఉంటుంది. మొదటి దశ ప్రిలిమ్స్. ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అంశాలలో మొత్తం 100 ప్రశ్నలకు వంద మార్కులకు గాను పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి రెండవ దశ మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, కాంపిటీటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలను మొత్తం 200 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 160 నిమిషాలు ఉంటుంది.
ఉత్తీర్ణత సాధించాలంటే
ఇక ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. జాబ్ సంపాదించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు మీ సమయాన్ని చక్కగా నిర్వహించాలి. అధ్యయనం కోసం నిర్ణీత సమయాన్ని కేటాయించాలి. టాపిక్ వారీగా నోట్స్ చేయడంలో మీరు ముందుండాలి. ఇక మునుపటి ప్రశ్నాపత్రాలను అధ్యయనం చేస్తుండాలి. దీని ద్వారా సెట్ ప్రశ్నలను అర్ధం చేసుకోవచ్చు. సరైన ప్రణాళిక ద్వారా సాధన చేస్తే సులువుగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment