Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో 30 సెకండ్లలో రూ.5 లక్షల లోన్... ఇలా అప్లై చేయాలి
ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్యూజర్లకు యాప్‌లోనే సులువుగా రుణాలు ఇచ్చేందుకు యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారానే యాక్సిస్ బ్యాంక్ సులువుగా పర్సనల్ లోన్ (Personal Loan) ఇస్తోంది. కొత్తగా తీసుకొచ్చిన పర్సనల్ లోన్ సర్వీస్ ద్వారా కస్టమర్లకు సులువైన లోన్ ఆప్షన్స్ అందిస్తామని, క్షణాల్లో రుణాలుమంజూరు చేస్తామని యాక్సిస్ బ్యాంక్ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు కేవలం 30 సెకండ్లలో రుణాలు పొందొచ్చు. గరిష్టంగా రూ.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. 6 నెలల నుంచి 36 నెలల రీపేమెంట్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. కస్టమర్లు సులువుగా పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే వారి పాన్ నెంబర్, పుట్టిన తేదీ, వర్క్ డీటెయిల్స్ లాంటివి తప్పనిసరి. ఈ బేసిక్ వివరాలు ఎంటర్ చేసి నిమిషాల్లో లోన్ తీసుకోవచ్చు. మరి మీరు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో లోన్ తీసుకోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవండి.
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్ యాప్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్తే మీకు క్రెడిట్ ఆప్షన్స్‌లో పర్సనల్ లోన్ లింక్ ఉంటుంది. క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ స్టెప్‌లో మీ బేసిక్ వివరాలు ఎంటర్ చేయాలి. బేసిక్ వివరాల్లో తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాలి. రెండో స్టెప్‌లో మీ వృత్తి, వ్యాపారం లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. మూడో స్టెప్‌లో మీకు మంజూరైన లోన్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి.
Bank Account: కస్టమర్లకు తెలియకుండా డబ్బులు కట్... మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేయండి
మీకు గరిష్టంగా రూ.5 లక్షల వరకు లోన్ మంజూరయ్యే అవకాశం ఉంటుంది. మీకు లోన్ ఎంత కావాలో అంత ఎంచుకోవచ్చు. వడ్డీ రేటు వివరాలు కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత ఎన్ని నెలల ఈఎంఐ ఆప్షన్స్ కావాలనుకుంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. 27, 30, 33, 36 నెలల ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజ్, స్టాంప్ డ్యూటీ, వడ్డీ రేటు, ఈఎంఐ, లోన్ పీరియడ్, మొదటి ఈఎంఐ తేదీ, చివరి ఈఎంఐ తేదీ లాంటి వివరాలన్నీ స్క్రీన్ పైన కనిపిస్తాయి. కన్ఫామ్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేస్తే, లోన్ డబ్బులు మీ అకౌంట్‌లో జమ అవుతాయి.
ఈ ఆప్షన్ ద్వారా లోన్ తీసుకునే సమయంలో వడ్డీ రేటు, ఛార్జీలు పరిశీలించాలి. బ్యాంకులో మీకు తక్కువ వడ్డీకే రుణాలు ఆఫర్ చేస్తున్నట్టైతే, బ్యాంకులోనే లోన్ తీసుకోవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే తమ యాప్ ద్వారా పే లేటర్, క్రెడిట్ కార్డ్స్ లాంటి సేవల్ని కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పర్సనల్ లోన్ విభాగంలోకి ఎంటరైంది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment