Breaking

Search Here

11 July 2023

Tirumala: Do you know what materials are used for the purification of Srivari Temple



Tirumala: శ్రీవారి ఆలయ శుద్ధికి ఏయే పదార్థాలు వినియోగిస్తారో తెలుసా..? కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం విశిష్టతలివే..!

తిరుమలలో ఏడాదికి నాలుసాగ్రు జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనానికి (Koil Alwar Tirumanjanam) చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో సాధారణ జలాలనే వినియోగిస్తారా..? ఆ నీటిలో ఎలాంటి పరిమళాలు వినియోగిస్తారనేది ఎవరికీ తెలియదు.







 



తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple) లో ఒక్కో సేవకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. నిత్యకల్యాణం జరిగే తిరుమలలో ఏడాదికి నాలుసాగ్రు జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనానికి (Koil Alwar Tirumanjanam) చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో సాధారణ జలాలనే వినియోగిస్తారా..? ఆ నీటిలో ఎలాంటి పరిమళాలు వినియోగిస్తారనేది ఎవరికీ తెలియదు.


తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీ సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఏడాదిలో నాలుగుసార్లు అనగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు.

స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు.


ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.


అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments