Search Here

15 July 2023

Anand Deverakonda: Anand said it was a fraud on Twitter on anchor Anasuya's fight Video goes viral


Anand Deverakonda : యాంకర్ అనసూయ గొడవపై ఆనంద్.. అది అంత ట్విట్టర్ చేసిన మోసం అంటూ.. వీడియో వైరల్.


హీరో ఆనంద్ దేవరకొండ లేటస్ట్‌గా బేబి అనే సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించగా.. SKN నిర్మించాడు. హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య చేసింది. ఈ సినిమా జూలై 14న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్’లో భాగంగా ఆనంద్ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


నటుడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. విజయ్ దేవరకొండ తమ్మడుగానే కాకుండా.. నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయిన.. ఆనంద్ తన నటనతో మెప్పించాడు.


ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక లేటస్ట్‌గా బేబి అంటూ వచ్చాడు. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించగా.. SKN నిర్మించాడు. హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య చేసింది. ఈ సినిమా జూలై 14న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్’లో భాగంగా ఆనంద్ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి


ఆనంద్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. విజయ్- అనసూయల మధ్య ఉన్న వివాదంపై వివరణ ఇచ్చారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ.. అసలు ఏ గొడవ లేదని.. వన్ సైడ్ నుంచే వచ్చిందే తప్పా.. మాసైడ్ నుంచి ఏమిలేదని.. ఎవడో ఏదో పేరు పెట్టుకుంటే.. మామూలుగా మనం పెద్దగా రెస్పాండ్ అవ్వం.. అయితే ట్విట్టర్‌ వచ్చాకా అంత మారింది.. అదో సైకలాజికల్ బిహేవియర్ అంటూ.. సోషల్ మీడియాలో అటెన్షన్ కోసం చేసేవారు ఉన్నారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే అది అనసూయను కాదని.. జస్ట్ ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పానంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది


బేబి సినిమా విషయానికి వస్తే.. ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరో కీలకపాత్రలో నటించారు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు


ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలించాయి. ఇలా సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 14న గ్రాండ్‌గా విడుదల అయింది. అంతేకాదు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది


ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తమ నటనతో అదరగొట్టారు. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. స్కూల్ లో చిగురించిన ప్రేమ, ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ.. కాలేజీకి వెళ్లాక ఎలా మారుతుందనే సన్నివేశాలతో సినిమాను అల్లుకున్నారు. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలోను అదరగొడుతోంది


ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. చిన్న సినిమాగా వచ్చిన ఈ బేబీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబట్టే ఆస్కారం ఉంది. విడుదలకు ముందే సాలిడ్ బజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ డే అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి


ఇక ఈ సినిమా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోసిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2.60 కోట్ల దాకా షేర్‌ని అందుకుని దుమ్ము లేపింది. వరల్డ్ వైడ్‌గా 3.2 కోట్ల రేంజ్‌లో షేర్ అందుకుంది. బేబీ ఫస్ట్ డే టోటల్‌గా 3.48 కోట్ల రేంజ్‌లో షేర్ సొంతం చేసుకుని వావ్ అనిపించింది. ఏరియాల వారికి ఈ సినిమా కలెక్షన్స్‌ చూస్తే

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments