Chandrababu: వాలంటీర్లు అక్రమాలకు పాల్పడితే ఈసీకి ఫిర్యాదు: చంద్రబాబు
ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ నేతల అరాచకాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.
అమరావతి: ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జులు, పరిశీలకులు, పార్లమెంట్, మండల అధ్యక్షులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, క్లస్టర్, యూనిట్ ఇన్‌ఛార్జ్‌లతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జులై 21వ తేది నుంచి ఆగష్టు 20వ తేది వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో గ్రామస్థాయిలోని ప్రతి ఒక్క బీఎల్‌ఏ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని జాబితా సవరణపై వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.
గ్రామస్థాయిలో అధికార పార్టీ నేతలు కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఓటరు జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని చంద్రబాబు తెలిపారు. అలాంటి తప్పులు గుర్తించిన బీఎల్ఏలు, పార్టీ నాయకులు వెంటనే పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాట్సప్ నంబర్ 91829-81134కు సమాచారం పంపించాలన్నారు. జాబితా సవరణలో వాలంటీర్ల పాత్ర ఉండకూడదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలన్నారు. కీలకమైన ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పనిచేసే ప్రతి ఒక్కరి సేవలను గుర్తుంచుకుంటామని, వారికి పార్టీలో సముచితమైన స్థానం ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల అరాచకాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని, తెదేపాతోనే రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ, రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చంద్రబాబు తేల్చి చెప్పారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment