TS Schools: తెలంగాణలో 26, 27న విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణలోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించింది.
హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ(Telangana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు మరోసారి సెలవులు(Holidays) ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ఈ నెల 26, 27న విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ (CM KCR)ఆదేశించారు. తెలంగాణలో వర్షాల కారణంగా విద్యాసంస్థలకు ఈ నెల 20, 21, 22 తేదీల్లో సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మరోసారి విద్యాసంస్థల(Educational Institutions)కు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
వాయువ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏర్పడిన అల్ప పీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్ప పీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24గంటల్లో తీవ్ర అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజులు పాటు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment