IT Refund: 80 లక్షల మందికి పన్ను రిఫండు
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు (ఈనెల 31) సమీపిస్తున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఈ ప్రక్రియ పూర్తి చేశారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్‌పర్సన్ నితిన్ గుప్తా వెల్లడించారు.
దిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు (ఈనెల 31) సమీపిస్తున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఈ ప్రక్రియ పూర్తి చేశారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్‌పర్సన్ నితిన్ గుప్తా వెల్లడించారు. ఇందులో అర్హులైన 80 లక్షల మందికి ఇప్పటికే రిఫండు అందించినట్లు పేర్కొన్నారు. ‘ఐటీ శాఖలో మానవ వనరుల కొరత కారణంగా, అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేకపోతున్నాం. ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించి, సిబ్బందిని త్వరగా నియమించేందుకు అనుమతులు ఇవ్వాలి’ అని కోరారు. సోమవారం ఆదాయపు పన్ను శాఖ 164వ వార్షికోత్సవం సందర్భంగా నితిన్ గుప్తా మాట్లాడుతూ వ్యక్తిగత, కార్పొరేట్ ప్రత్యక్ష పన్నులు కలిపి 2022-23లో రూ.16.61 లక్షల కోట్లు వసూలైనట్లు పేర్కొన్నారు. 2021-22తో పోలిస్తే ఇది 17.67% అధికమన్నారు. సాధ్యమైనంత తొందరగా రిటర్నులు ప్రాసెస్ చేసి, రిఫండు అందిస్తున్నామని తెలిపారు. గరిష్ఠంగా 16 రోజుల్లో ఐటీఆర్‌లను ప్రాసెస్ చేస్తున్నామని, దాదాపు 42% ఐటీఆర్‌లు ఒక రోజులోనే ప్రాసెస్ చేసినట్లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment