Breaking

Search Here

26 July 2023

Hyderabad: ఐటీ ఉద్యోగులకు 3విడతల్లో లాగ్‌అవుట్‌


Hyderabad: ఐటీ ఉద్యోగులకు 3విడతల్లో లాగ్‌అవుట్‌

వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్న నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.


హైదరాబాద్‌: వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్న నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశల్లో లాగ్‌ అవుట్‌ చేసుకోవాలని సైబరాబాద్‌ పోలీసులు సూచించారు. గ్రేటర్‌ వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. విపరీతమైన వాహన రద్దీతో జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట ప్రాంతాల్లో అంబులెన్సులకు దారి దొరకలేదు. కార్యాలయాలు మూతపడే సమయంలో కుంభవృష్టిగా వాన కురవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అత్తాపూర్‌, శివరాంపల్లి, హైటెక్‌సిటీ, మలక్‌పేట రైల్వే స్టేషన్‌, నాగోల్‌, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లోని రోడ్లపై నడుములోతు నీటితో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. హైటెక్‌సిటీలో ఎటు చూసినా రోడ్లపై వాహనాల బారులే కనిపించాయి. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర రంగంలోకి దిగినా పరిస్థితి అర్ధరాత్రి వరకు అదుపులోకి రాలేదు. ఈనేపథ్యంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు సైబరాబాద్‌ పోలీసులు ప్రణాళిక రూపొందించారు.


సైబరాబాద్‌ పోలీసుల సూచనలివే..

ఫేజ్ - 1

ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.


ఫేజ్ - 2 

ఐకియా నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.


ఫేజ్ - 3 

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని సైబరాబాద్‌ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments