Breaking

Search Here

28 July 2023

Byjus Employee: బలవంతంగా రాజీనామా చేయించారు.. కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్‌ ఉద్యోగి

Byjus Employee: బలవంతంగా రాజీనామా చేయించారు.. కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్‌ ఉద్యోగి


బైజూస్‌ (Byjus)పై ఓ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. తనను బలవంతంగా రాజీనామా చేయించారని, లేకపోతే జీతం ఇవ్వబోమని బెదిరించారని ఆరోపించారు.


ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈడీ దాడులు (ED Raids), లేఆఫ్‌ (Layoffs) సమస్యలతో కొన్ని నెలలుగా సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ (EdTech) కంపెనీ బైజూస్‌ (Byjus) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీలో లేఆఫ్‌కు గురైన ఓ ఉద్యోగి బైజూస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యోగులు, కస్టమర్లను కంపెనీ మోసగిస్తోందని ఆరోపించారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని..తనకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వాన్ని సాయం కోరుతూ లింక్డ్‌ఇన్‌ (LinkedIn)లో ఓ వీడియో (Viral Video) పోస్ట్ చేశారు.


ఆకాంక్ష ఖేమ్కా ఏడాదిన్నర పాటు బైజూస్‌ (Byjus)లో అకడమిక్‌ స్పెషలిస్ట్‌గా పనిచేశారు. ఇటీవల ఆమె పేరును లేఆఫ్‌ జాబితాలో చేర్చారు. అయితే, కారణం లేకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆకాంక్ష మనస్తాపం చెందారు. లింక్డ్ఇన్‌ వేదికగా తన ఆవేదన బయటపెట్టారు. ‘‘తక్షణమే రాజీనామా చేయాలని వారు(బైజూస్‌) నాకు లేఖ పంపారు. లేదంటే వేతనం చెల్లించబోమని బెదిరించారు. నా వేరియబుల్స్‌, ఇతర చెల్లింపులు కూడా చేయలేదు. నా కుటుంబానికి ఇప్పుడు నేను ఆధారం. నా భర్తకు ఆరోగ్యం సరిగా లేదు. లోన్‌లు చెల్లించాలి. జీతం, బకాయిలు ఇవ్వకపోతే నేను ఎలా బతకాలి?’’ అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.


కష్టాలు చుట్టుముట్టిన వేళ.. బైజూస్‌ రవీంద్రన్‌ కంటతడి!


‘‘ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు నాకు ప్రభుత్వం నుంచి సాయం కావాలి. లేదంటే చావు తప్ప మరో మార్గం లేదు. నేను స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే నా జీతం నాకు రాదు. దయచేసి సాయం చేయండి. ఇక ఈ విషపూరిత పని విధానం నుంచి బయటపడేలా మిగతా ఉద్యోగులకు కూడా సాయం చేయాలని కోరుతున్నా. బైజూస్‌ అనేక మోసాలకు పాల్పడుతోంది. కస్టమర్లు, ఉద్యోగులను కూడా మోసగిస్తోంది’’ అని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఎడ్‌ టెక్‌ స్టార్టప్‌ బైజూస్‌ (Byjus) ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు నిలిచిపోవడం, బోర్డు నుంచి డైరెక్టర్లు వైదొలగడం, సంస్థకు ఆడిటర్‌ గుడ్‌బై చెప్పడం వంటి అంశాలతో ఆ సంస్థ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే, కష్టాలు చుట్టుముట్టిన వేళ.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.



No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments