Breaking

Search Here

25 December 2021

Omicron cases in india: పెరుగుతున్న కేసులు.. భారత్​లో కరోనా థర్డ్​ వేవ్​ వచ్చే అవకాశం.. ఐఐటీ కాన్పూర్​ రిపోర్టు

Omicron cases in india: పెరుగుతున్న కేసులు.. భారత్​లో కరోనా థర్డ్​ వేవ్​ వచ్చే అవకాశం..  ఐఐటీ కాన్పూర్​ రిపోర్టు
Omicron cases in india: పెరుగుతున్న కేసులు.. భారత్​లో కరోనా థర్డ్​ వేవ్​ వచ్చే అవకాశం..  ఐఐటీ కాన్పూర్​ రిపోర్టు

Omicron cases in india: పెరుగుతున్న కేసులు.. భారత్​లో కరోనా థర్డ్​ వేవ్​ వచ్చే అవకాశం..  ఐఐటీ కాన్పూర్​ రిపోర్టు


Omicron cases in india: పెరుగుతున్న కేసులు.. భారత్​లో కరోనా థర్డ్​ వేవ్​ వచ్చే అవకాశం..  ఐఐటీ కాన్పూర్​ రిపోర్టు


దేశంలో క్రమంగా కేసుల సంఖ్య (Omicron cases in India) పెరుగుతుండటంతో పెద్ద తలనొప్పిగా మారింది.  ఈ నేపథ్యంలో భారత్​లో కరోనా కేసుల (Corona cases) పెరుగుదల సరళి చూసి IIT కాన్పూర్ (IIT-K) పరిశోధకులు కోవిడ్-19 థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


దక్షిణాఫ్రికా (South Africa)లో పుట్టిన ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపిస్తోంది. ఇక భారత్‌లో కూడా మెల్లమెల్లగా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. మళ్లీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ పట్టి పీడిస్తుండటంతో భయాందోళన నెలకొంది. దేశంలో క్రమంగా కేసుల సంఖ్య (Omicron cases in India) పెరుగుతుండటంతో పెద్ద తలనొప్పిగా మారింది.  ఈ నేపథ్యంలో భారత్​లో కరోనా కేసుల (Corona cases) పెరుగుదల సరళి చూసి IIT కాన్పూర్ (IIT-K) పరిశోధకులు కోవిడ్-19 థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త వేరియంట్ Omicron ఫిబ్రవరి 3, 2022 నాటికి భారత్‎లో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆన్‎లైన్‎లో హెల్త్ సర్వర్ MedRxiv నివేదిక ప్రచురించింది. ‘‘ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్‌లను అనుసరించి, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇండియాలో థర్డ్ వేవ్ (Corona Third wave) డిసెంబర్​ మధ్యలో ప్రారంభమై ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది.”


థర్డ్ వేవ్ (Third wave)‎ను అంచనా వేయడానికి బృందం గాస్సియన్ మిక్స్చర్ మోడల్‎ను ఉపయోగించింది. పరిశోధనా నివేదిక భారతదేశంలోని ఫస్ట్, సెకండ్ వేవ్ డేటా (second wave data)ను, దేశంలోని థర్డ్ వేవ్ అంచనా వేయడానికి వివిధ దేశాలలో ఒమిక్రాన్​ (Omicron) వేరియంట్ కేసుల పెరుగుదల ఆధారంగా నివేదిక రూపొందించింది. ఓమిక్రాన్ పరిశోధకులు (Omicron researchers) మాట్లాడుతూ.. మా ప్రాథమిక పరిశీలన తేదీ నుంచి 735 రోజుల తర్వాత కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని భావిస్తున్నాం” అన్నారు.


‘‘జనవరి 30, 2020 ఇండియా (India)లో మొదటి అధికారిక కోవిడ్-19 కేసు నమోదయింది. కాబట్టి డిసెంబర్ 15 నాటికి కేసులు పెరగడం ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 3, 2022 నాటికి మూడో వేవ్ (Third wave) గరిష్ఠ స్థాయి చేరుతాయి”అని అన్నారు. IIT కాన్పూర్‎లోని గణితం, గణాంక శాస్త్ర విభాగానికి చెందిన సబర పర్షద్ రాజేష్‌భాయ్, సుభ్రా శంకర్ ధర్ మరియు శలభ్ పరిశోధన బృందంలో ఉన్నారు. IIT కాన్పూర్ (IIT Kanpur) ఇండియాలో సెకండ్ వేవ్ (second wave ) వస్తుందని అంచనా వేసింది. అప్పుడు వారి అంచనా నిజమైంది.


ఇక ఒమిక్రాన్‌ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం (Central Government) చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్‌ కట్టడికి చర్యలు చేపట్టే విధంగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. వైరస్‌ నియంత్రణకు పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తోంది. కేంద్రం సూచనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని ఆయన తెలిపారు.


శుక్రవారం సాయంత్రం దేశంలో నమోదైన ఒమిక్రాన్​ వివరాల్ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ (Union Health Secretary Rajesh Bhushan)  వెల్లడించారు. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటిదాకా 358 ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయినట్లు రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. మొత్తం ఒమిక్రాన్​ కేసుల్లో 244 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు, 114 మంది పేషెంట్లు ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో అధికంగా 88, ఢిల్లీలో 67, 38, 34, 31, గుజరాత్‌ 30, 27, రాజస్థాన్‌ 22 కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం తెలిపింది. హర్యానా, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌, ఏపీ, యూపీ, ఛండీగఢ్‌, లడక్‌లలో కేసులు నమోదు అయ్యాయి

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments