Pushpa - Vakeel Saab - Love Story: 2021లో పాజిటివ్ టాక్ వచ్చాక కూడా బ్రేక్ ఈవెన్ సాధించని 12 సినిమాలు ఇవే.. |
Pushpa - Vakeel Saab - Love Story: 2021లో పాజిటివ్ టాక్ వచ్చాక కూడా బ్రేక్ ఈవెన్ సాధించని 12 సినిమాలు ఇవే..
Pushpa - Vakeel Saab - Love Story: సాధారణంగా సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా వసూళ్లు కూడా బాగానే వస్తుంటాయి. కానీ 2021లో మాత్రం అలా జరగలేదు. కొన్ని సినిమాలకు టాక్ బాగున్నా కూడా వసూళ్లు మాత్రం రాలేదు. బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోయాయి.
సాధారణంగా సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా వసూళ్లు కూడా బాగానే వస్తుంటాయి. కానీ 2021లో మాత్రం అలా జరగలేదు. కొన్ని సినిమాలకు టాక్ బాగున్నా కూడా వసూళ్లు మాత్రం రాలేదు. బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోయాయి. మరికొన్ని సినిమాలు అయితే ఏకంగా డిజాస్టర్ కూడా అయిపోయాయి. దానికి కరోనా కూడా ఓ కారణంగా కనబడుతుంది.
సాధారణంగా సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా వసూళ్లు కూడా బాగానే వస్తుంటాయి. కానీ 2021లో మాత్రం అలా జరగలేదు. కొన్ని సినిమాలకు టాక్ బాగున్నా కూడా వసూళ్లు మాత్రం రాలేదు. బ్రేక్ ఈవెన్ కూడా కాలేకపోయాయి. మరికొన్ని సినిమాలు అయితే ఏకంగా డిజాస్టర్ కూడా అయిపోయాయి. దానికి కరోనా కూడా ఓ కారణంగా కనబడుతుంది.
థియేటర్స్ అంతంతమాత్రంగానే ఉండటం.. ఆడియన్స్ కూడా బయటికి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో సినిమాలకు మంచి టాక్ వచ్చిన తర్వాత కూడా ఫ్లాప్ అయ్యాయి. అలా 2021లో కొన్ని సినిమాలకు జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
థియేటర్స్ అంతంతమాత్రంగానే ఉండటం.. ఆడియన్స్ కూడా బయటికి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో సినిమాలకు మంచి టాక్ వచ్చిన తర్వాత కూడా ఫ్లాప్ అయ్యాయి. అలా 2021లో కొన్ని సినిమాలకు జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. వకీల్ సాబ్: లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. వకీల్ సాబ్ సినిమాకు వచ్చిన టాక్‌కు కలెక్షన్స్ 150 కోట్లు రావాలి. కానీ బ్రేక్ ఈవెన్‌కు 5 కోట్ల దూరంలో ఆగిపోయి యావరేజ్‌గా మారిపోయాడు వకీల్ సాబ్. 89 కోట్ల బిజినెస్ చేస్తే.. ఈ సినిమాకు వచ్చిన ఫైనల్ కలెక్షన్స్ 85 కోట్లు. అప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎక్కువగానే కనిపించినా కూడా బయ్యర్లకు మాత్రం స్వల్ప నష్టాలు తప్పలేదు.
2. పుష్ప ది రైజ్: ఈ సినిమా ఫుల్ రన్ ఇంకా అవ్వలేదు. థియేటర్స్‌లోనే ఉన్నాడు పుష్ప. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తొలిరోజు టాక్ బాగానే వచ్చింది. బన్నీ కోసం చూడొచ్చురా అంటూ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకున్నారు. ఓపెనింగ్స్ కూడా అలాగే వచ్చాయి కానీ 4 రోజుల తర్వాత వీక్ డేస్‌లో వీక్ అయ్యాడు పుష్ప. ఇప్పటికీ 45 కోట్ల దూరంలోనే ఉన్నాడు ఈయన.
3. సుమంత్ అక్కినేని కపటదారి: ఈ సినిమాకు టాక్ యావరేజ్‌గా వచ్చినా కనీసం కోటి షేర్ కూడా వసూలు చేయలేదు.
4. నితిన్ చెక్: చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన చెక్ సినిమాకు ఓ వర్గం నుంచి మంచి టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ లేవు.
5. అక్షర: చిన్ని కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు టాక్ బాగున్నా కనీసం వచ్చినట్లు కూడా తెలియదు. దాంతో వారానికే ఓటిటిలో విడుదల చేసారు.
6. ఏ1 ఎక్స్‌ప్రెస్: సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కూడా టాక్ బాగానే వచ్చింది కానీ ఓపెనింగ్స్ రాలేదు.. తర్వాత నిలబడలేదు.
7. షాదీ ముబారక్: దిల్ రాజు నిర్మించిన ఈ చిన్న సినిమాకు సూపర్ టాక్ వచ్చింది. కానీ పబ్లిసిటీ లోపంతో కనీస వసూళ్లు కూడా రాలేదు.
8. శ్రీకారం: మార్చ్ 11న శివరాత్రి కానుకగా విడుదలైన శర్వానంద్ శ్రీకారం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్‌లో మాత్రం అది కనిపించలేదు.
9. రంగ్ దే: నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే సినిమాకు టాక్ బాగానే వచ్చినా.. చివరికి 6 కోట్ల నష్టాలు తీసుకొచ్చింది.
10. అరణ్య: రానా దగ్గుబాటి అరణ్య సినిమాకు టాక్ బాగా వచ్చింది. సందేశాత్మక చిత్రం అంటూ అంతా పొగిడారు. కానీ డబ్బులు మాత్రం రాలేదు.
11. వైల్డ్ డాగ్: నాగార్జున అక్కినేని నటించిన వైల్డ్ డాగ్ ఓటిటిలో దుమ్ము దులుపుతుంది. కానీ థియేటర్స్‌లో మాత్రం ఈ సినిమా అస్సలు ఆడలేదు.
12. లవ్ స్టోరి: వినడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ లవ్ స్టోరి సైతం ఆంధ్రలో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. నైజాంలో ఈ సినిమాకు మార్జిన్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్రతో పాటు ఈస్ట్, వెస్ట్‌లో కూడా నష్టాలు తప్పలేదు. కరోనా కారణంగా అప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీ ఉండటంతో నష్టాలు తప్పలేదు. పాజిటివ్ టాక్ వచ్చాక కూడా లవ్ స్టోరి కొన్ని ఏరియాల్లో నష్టాల బారిన పడింది. 32 కోట్ల బిజినెస్ చేస్తే.. 33 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment