|
Movie ticket rates in AP & TS: ఏపీ, తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..? |
Movie ticket rates in AP & TS: ఏపీ, తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
ఏపీ తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు (movie Ticket rates in AP TS)
Movie ticket rates in AP & TS: ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం సినిమా టికెట్స్‌పై చర్చ బాగా జరుగుతుంది. ఒక చోట భారీ రేట్లు ఉండగా.. మరోచోట మాత్రం ఛాయ్ కంటే తక్కువ రేట్లకు సినిమాలు చూసే అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్. మరి ఏపీ, తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు (Movie ticket rates in AP & TS) ఎలా ఉన్నాయో చూద్దాం..
Praveen Kumar Vadla
ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం సినిమా టికెట్స్‌పై చర్చ బాగా జరుగుతుంది. ఒక చోట భారీ రేట్లు ఉండగా.. మరోచోట మాత్రం ఛాయ్ కంటే తక్కువ రేట్లకు సినిమాలు చూసే అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి జగన్. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు పెంచుకోమ్మని.. మరోవైపు తగ్గించమని ఆదేశాలు జారీ చేసారు. ఏపీలో కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు ఉంది. మరోవైపు తెలంగాణలో 50 నుంచి మొదలై 300 వరకు ధరలున్నాయి. మరి ఈ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఏపీలో టికెట్ రేట్లు..
మున్సిపల్ కార్పొరేషన్లు.. |
మున్సిపాలిటీలు.. |
నగర పంచాయతీలు.. |
గ్రామ పంచాయతీలు.. |
1. మల్టీప్లెక్స్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75 ధరలుగా నిర్ణయించారు. |
1. మల్టీప్లెక్స్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60 ధరలుగా నిర్ణయించారు. |
1. మల్టీప్లెక్స్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40 ధరలుగా నిర్ణయించారు. |
1. మల్టీప్లెక్స్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30 ధరలుగా నిర్ణయించారు. |
2. ఏసీ/ఎయిర్ కూల్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40 ధరలుగా నిర్ణయించారు. |
2. ఏసీ/ఎయిర్ కూల్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30 ధరలుగా నిర్ణయించారు. |
2. ఏసీ/ఎయిర్ కూల్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15 ధరలుగా నిర్ణయించారు. |
2. ఏసీ/ఎయిర్ కూల్ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10 ధరలుగా నిర్ణయించారు. |
3. నాన్ ఏసీ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20 ధరలుగా నిర్ణయించారు. |
3. నాన్ ఏసీ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15 ధరలుగా నిర్ణయించారు. |
3. నాన్ ఏసీ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10 ధరలుగా నిర్ణయించారు. |
3. నాన్ ఏసీ థియేటర్స్ కోసం ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5 ధరలుగా నిర్ణయించారు. |
తెలంగాణలో టికెట్ ధరలు..
అదే సమయంలో తెలంగాణలో మాత్రం సినిమా టికెట్ ధరలు చాలా వేరుగా ఉన్నాయి. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ అనుమతులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన తెలంగాణ సర్కారు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
1. AC థియేటర్లలో కనిష్ఠం రూ.50 + GST.. గరిష్ఠం రూ.150+GST
2. Non AC థియేటర్లలో కనిష్ఠం రూ.30+GST.. గరిష్ఠం రూ.70+GST
3. మల్టీప్లెక్స్‌ల్లో కనిష్ఠం రూ.100+GST.. గరిష్ఠం రూ.250+GST
4. సింగిల్ థియేటర్లలో రిక్లైనర్ సీట్స్ ఉంటే గరిష్ఠంగా రూ.200+GST.. మల్టీప్లెక్స్‌లో రిక్లైనర్స్‌కు గరిష్ఠంగా రూ.300+GST
5. స్పెషల్ ఐమాక్స్ లార్జ్ స్క్రీన్ (75 MM మించిన) సింగిల్ థియేటర్లలో.. రూ.250+GST
6. నిర్వహణ చార్జీల కింద AC థియేటర్లలో టికెట్ పై రూ.5, నాన్-ఏసీలో టికెట్‌పై రూ.3 వసూలు చేసుకునేందుకు అనుమతించిన ప్రభుత్వం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Aadi Saikumar: ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుక.. బెస్ట్ విషెస్ చెప్పిన 'తీస్ మార్ ఖాన్' టీమ్..
Aadi Saikumar: ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుక.. బెస్ట్ విషెస్ చెప్పిన 'తీస్ మార్ ఖాన్' టీమ్..
ఆది సాయికుమార్ బర్త్ డే (Aadi Saikumar)
Aadi Saikumar: 'ప్రేమ కావాలి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది సాయి కుమార్ (Aadi Saikumar) అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి గుర్తింపు దక్కించుకుంటున్నారు. ఈ సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ మేల్ యాక్టర్‌గా అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత ఎక్కడ వెనుతిరిగి చూడలేదు.
Praveen Kumar Vadla
'ప్రేమ కావాలి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది సాయి కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఈ సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ మేల్ యాక్టర్‌గా అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత ఎక్కడ వెనుతిరిగి చూడలేదు. వరుస ఆఫర్స్ పట్టేస్తూ విలక్షణ కథలతో అలరిస్తున్నారు. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను కూడగట్టుకున్న ఈ హీరో మరికొద్ది రోజుల్లో 'తీస్ మార్ ఖాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో 'తీస్ మార్ ఖాన్' నిర్మాత తమ విజన్ సినిమాస్ ఆఫీసులో ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. పలువురు సన్నిహితుల మధ్య జరిగిన ఈ పార్టీలో ఆది సాయి కుమార్ చేత కేక్ కట్ చేయించి ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పింది 'తీస్ మార్ ఖాన్' టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 'తీస్ మార్ ఖాన్' దర్శకనిర్మాతలు నాగం తిరుపతి రెడ్డి, కళ్యాణ్ జి గోగణ.. ఆది సాయి కుమార్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'తీస్ మార్ ఖాన్' ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతకు కృతజ్ఞతలు చెప్పిన ఆది సాయి కుమార్.. ముందు ముందు మరిన్ని వినూత్న కథలతో అలరిస్తానని అన్నారు. ఇక 'తీస్ మార్ ఖాన్' సినిమా విషయానికొస్తే.. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లాన్స్ ఆది సాయి కుమార్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వీడియోలో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌లో కనిపించి సినిమాపై హైప్ పెంచేశారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment