Breaking

Search Here

25 December 2021

KTR : కేటిఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ఒపినియన్ పోల్.. తీవ్రంగా స్పందించిన కేటిఆర్...

 

KTR : కేటిఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ఒపినియన్ పోల్.. తీవ్రంగా స్పందించిన కేటిఆర్...
KTR : కేటిఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ఒపినియన్ పోల్.. తీవ్రంగా స్పందించిన కేటిఆర్...

KTR : కేటిఆర్ కొడుకు హిమాన్షుపై తీన్మార్ మల్లన్న ఒపినియన్ పోల్.. తీవ్రంగా స్పందించిన కేటిఆర్...


KTR : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ నేత.. క్యూ న్యూస్ మల్లన్నపై మండిపడ్డారు. చిన్నపిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావడం పై ఆయన అభ్యంతరం చెబుతూ...బీజేపీ అధిష్టానానికి ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించారు.


టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్‌లో నిర్వహించిన పోల్‌పై ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డాను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. బీజేపీ నేతలకు నేర్పే సంస్కృతి ఇదేనా... అంటూ ప్రశ్నించారు. మీ పార్టీ నేతలకు కూడా ఇదే నేర్పుతున్నారా అంటూ ప్రశ్నించారు.. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా కుటుంబంపై ఇలాంటీ విమర్శలు చేస్తే పరిస్థితి ఏమిటని ..మీరు ఏమైనా ఆలోచించారా అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


మరోవైపు జర్నలిజం పేరిట వ్యక్తి స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తన కొడుకు హిమాన్షుపై పోల్ పెట్టి శరీరంపై ఒపినియన్ అడగడం ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని, ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో విమర్శించేందుకు, బురదజల్లేందుకు హక్కుగా మారిందన్నారు. సోషల్ మీడియాను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసాంఘిక ప్రవర్తనకు సామాజిక మాధ్యమాలు అనుకూలంగా మారాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. జర్నలిజం ముసుగులో యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా నిత్యం అర్థంలేని విషయాలను ప్రసారం చేస్తున్నారని, చిన్న పిల్లలను కూడా ఇందులోకి లాగుతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments