Breaking

Search Here

25 December 2021

Big News Big Debate: మలుపులు తిరుగుతున్న ఏపీ సినిమా స్టోరీలో క్లైమాక్స్‌ ఏంటి..?

Big News Big Debate: మలుపులు తిరుగుతున్న ఏపీ సినిమా స్టోరీలో క్లైమాక్స్‌ ఏంటి..?
Big News Big Debate: మలుపులు తిరుగుతున్న ఏపీ సినిమా స్టోరీలో క్లైమాక్స్‌ ఏంటి..?

 Big News Big Debate: మలుపులు తిరుగుతున్న ఏపీ సినిమా స్టోరీలో క్లైమాక్స్‌ ఏంటి..?

ఆది లేదు.. అంతం లేదన్నట్టుగా సాగుతోంది APలోని సినిమా వివాదం. పూటకో కామెంట్‌. రోజుకో రచ్చగా మారింది మూవీ టికెట్ల వ్యవహారం.


Big News Big Debate: మలుపులు తిరుగుతున్న ఏపీ సినిమా స్టోరీలో క్లైమాక్స్‌ ఏంటి..?

Big News Big Debate


మలుపులు తిరుగుతున్న స్టోరీలో క్లైమాక్స్‌ ఏంటి.?

సినీ ఇండస్ట్రిని AP ప్రభుత్వమే టార్గెట్‌ చేసిందా?

ప్రజా ప్రయోజనం కోసమే జీవో తెచ్చిందా.?

పార్టీలు చూస్తున్న పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ ఏంటి.?


ఆది లేదు.. అంతం లేదన్నట్టుగా సాగుతోంది APలోని సినిమా వివాదం. పూటకో కామెంట్‌. రోజుకో రచ్చగా మారింది మూవీ టికెట్ల వ్యవహారం. సామాన్య ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ధరలు తగ్గించాలంటోంది ఏపీ ప్రభుత్వం. జీవో ప్రకారం అయితే కిరాణా కొట్టు, టీ బండి కంటే దారుణంగా కలెక్షన్లు ఉంటాయంటోంది చిత్ర పరిశ్రమ. కేసు కోర్టులో నడుస్తుండగానే ఇండస్ట్రీలో ఉక్కపోత మొదలైంది. తెలంగాణలో వరాలు ఇస్తుంటే.. ఏపీలో మాత్రం సవాళ్లేంటని పరిశ్రమ పెద్దలకు గాలి ఆడటం లేదు. టాలీవుడ్‌లో హెమాహెమీలు కూడా గట్టిగా అడగలేరు. బయటపడకుండా ఉండలేరు. కక్కలేక మింగలేక సతమతమవుతున్నారా?


న్యూ ఇయర్‌ to సంక్రాంతి పండగ సీజన్‌. పైగా రిలీజులకు బడా మూవీలున్నాయి. కలెక్షన్లతో కళకళలాడాల్సిన థియేటర్లు ఇలా మూగబోయాయి. ఏపీ అంతటా అధికారులు సీజ్‌ చేసినవి 50కి పైగా ఉంటే మరో 50 స్వచ్చందంగానే మూసేశారు థియేటర్ల యజమానులు. కరోనా పేండమిక్‌ తర్వాత కొత్త సినిమాలతో కష్టాల నుంచి గట్టెక్కుతామని ఆశగా చూసిన ఎగ్జిబిటర్స్‌ వ్యవస్థకు ఆశనిపాతంగా మారింది తాజా వివాదం.


ఏపీలో టికెట్‌ వివాదం సినిమా హాలు యజమాని నుంచి హీరోదాకా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ప్రకారం ధరలు మరీ తక్కువగా ఉన్నాయంటోంది ఇండస్ట్రీ. దీని వల్ల కరెంట్‌ ఖర్చులు రావన్నది వారి వాదన అయితే సామాన్యులను దృష్టిలో పెట్టుకుని మరీ GO తెచ్చామంటోంది సర్కార్‌. జీవో వ్యవహారం కోర్టుకు చేరినా.. ఇరువర్గాల మాటకు మాటతో వివాదం రోడ్డున పడింది.


కిరాణ కలెక్షన్ల కంటే దారుణమని నాని వ్యాఖ్యలు అగ్గిరాజేస్తే… హీరో సిద్దార్థ్‌ తన సంచలన ట్వీట్‌తో ఆజ్యం పోశారు. పన్నులు రూపంలో కట్టే మా డబ్బుతో లగ్జరీలు, వేలు, లక్షల కోట్లు అవినీతి చేస్తున్న మంత్రులు తమ విలాసాలు తగ్గించుకుని మాకు డిస్కౌంట్‌ ఇవ్వాలంటూ సెటైర్‌ వేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రులు బొత్స, కొడాలి నాని, కన్నబాబు లేటెస్టుగా అనిల్‌ యాదవ్‌ కౌంటర్‌ ఎటాక్‌లు ఇస్తున్నారు. హీరోలు తమ రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలని వకీల్‌సాబ్‌, బీమ్లా నాయక్‌ సినిమాల ఖర్చెంత. పవన్‌ కల్యాణకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ ఎంతంటూ ప్రశ్నించారు మంత్రి అనిల్‌.మంత్రి అనిల్‌ వ్యాఖ్యలతో వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. ఒక్కరిని టార్గెట్‌ చేసి ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బందులు పెడుతున్నారంటున్నాయి ప్రతిపక్షాలు.


జీవో అనంతర పరిణామాలపై చర్చలతో వివాదానికి క్లైమాక్స్‌ పడుతుందని అంతా ఆశించారు. మంత్రి పేర్ని నానికి సినిమాటొగ్రఫి శాఖ అప్పగించింది ప్రభుత్వం. కానీ రచ్చ రోజురోజుకు రావణ కాష్టంలా ఎగసిపడుతూనే ఉంది. మరి సర్కార్‌ వర్సెస్‌ సినిమా ఇండస్ట్రీకి ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడు పడుతుందో. ఎలా పడుతుందో చూడాలి.?— బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్


ఈ ఇష్యూపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ వీడియో దిగువన చూడండి.


Shyam Singha Roy Review: స్క్రీన్‌ మీద కలర్‌ఫుల్‌గా శ్యామ్‌ సింగరాయ్‌.. నాని మూవీ రివ్యూ..

వి, టక్‌ జగదీష్‌ తర్వాత థియేటర్లలోకి వచ్చిన నాని సినిమా శ్యామ్‌ సింగరాయ్‌. బెంగాల్‌ బ్యాక్‌డ్రాప్‌, నాని గెటప్స్, సాయిపల్లవి లుక్స్,


Shyam Singha Roy Review: స్క్రీన్‌ మీద కలర్‌ఫుల్‌గా శ్యామ్‌ సింగరాయ్‌.. నాని మూవీ రివ్యూ..

Shyam Singa Roy

వి, టక్‌ జగదీష్‌ తర్వాత థియేటర్లలోకి వచ్చిన నాని సినిమా శ్యామ్‌ సింగరాయ్‌. బెంగాల్‌ బ్యాక్‌డ్రాప్‌, నాని గెటప్స్, సాయిపల్లవి లుక్స్, డ్యాన్సులు, పాటలు… అన్నిటికి మించి రీసెంట్‌గా థియేటర్లలో టిక్కెట్ల గురించి నాని చేసిన కామెంట్స్… అన్నీ కలిపి శ్యామ్‌ సింగరాయ్‌ మీద అటెన్షన్‌ పెంచేశాయి. ఈ సినిమా ఎలా ఉంది? చూసేద్దాం


సినిమా: శ్యామ్‌ సింగరాయ్‌

నిర్మాణ సంస్థ: నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్

నటీనటులు: నాని, సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్న సెబాస్టియన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, జిషుసేన్‌ గుప్తా, లీలా శామ్‌సన్‌, మనీష్‌ వద్వా తదితరులు

దర్శకత్వం: రాహుల్‌ సంకృత్యాన్‌

రచన: జంగా సత్యదేవ్‌

నిర్మాత: వెంకట్‌ బోయనపల్లి

కెమెరా: సాను జాన్‌ వర్గీస్‌

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

సంగీతం: మిక్కీ జె మేయర్‌

రిలీజ్‌ డేట్‌: డిసెంబర్‌ 24, 2021


వాసు(నాని) డైరక్టర్‌ కావాలనుకుంటాడు. అందులో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తాడు. అందులో కీర్తీ (కృతి శెట్టి) నటిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. సడన్‌గా ఓ కేసులో ఇరుక్కుంటాడు వాసు. అతన్ని కాపాడుకోవడానికి కజిన్‌ (మడోన్న సెబాస్టియన్‌) సాయం కోరుతుంది కీర్తీ. ఈ క్రమంలో వాళ్లకి రోసీ గురించి తెలుస్తుంది. రోసీ సింగరాయ్‌ ఎవరు? ఆమెకు, వాసుకు సంబంధం ఏంటి? మధ్యలో వాసు ఇరుక్కున్న కేసు సంగతి ఏమైంది? వాసుని మనోజ్‌ కేసు నుంచి ఎలా బయటపడేశాడు? అనేది ఆసక్తికరమైన అంశం.


ఆల్రెడీ డైరక్షన్‌ డిపార్ట్ మెంట్‌లో చేసిన వ్యక్తి,… డైరక్టర్‌ కావాలని కలలు కన్న వ్యక్తి…. కావడంతో నానికి వాసు కేరక్టర్‌లో నటించడం పెద్ద పనేం కాదు. తనకున్న ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టే నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు. శ్యామ్‌సింగరాయ్‌ కేరక్టర్‌లోనూ మేనరిజమ్స్ బాగా పండించారు. ఒక చేతిలో హీరో పెన్ను, ఇంకో చేతిలో సిగరెట్‌, ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేసేటప్పుడు, టైప్‌ రైటర్‌ మీద టైప్‌ చేసేటప్పుడు, అన్ని సందర్భాల్లోనూ చాలా బాగా కనిపించారు నాని. ఉప్పెనలో లంగా ఓణీలతో, చుడిదార్లతో ఆకట్టుకున్న కృతి శెట్టి ఇందులో మోడ్రన్‌ గర్ల్ గా, సైకాలజీ స్టూడెంట్‌గా మెప్పించారు. ఉప్పెనతో పోలిస్తే ఇందులో కృతికి పెర్ఫార్మెన్స్ కి కూడా స్కోప్‌ ఉంది. చాలా ట్రెండీగా కనిపించింది అమ్మాయి. సాయిపల్లవి దేవదాసి మైత్రేయిగా మెప్పించారు. ఆమె కాస్ట్యూమ్స్, లుక్, పెర్ఫార్మెన్స్, ఆలోచనల తీరు, ఆమె లోకాన్ని చూసే విధానం ప్రతిదీ ఆకట్టుకుంది. మనీష్‌ వద్వా చూడగానే క్రూయల్‌గా కనిపించారు. లీలా శామ్‌సన్‌ తనకు తగ్గట్టు హుందాగా కనిపించారు. రాహుల్‌ రవీంద్రన్‌ చాన్నాళ్ల తర్వాత ఇంపార్టెన్స్ ఉన్న కేరక్టర్‌ చేశారు. సినిమా ఆద్యంతం రీరికార్డింగ్‌, కొన్ని ట్యూన్లు ప్లెజెంట్‌గా అనిపించాయి.


రైటర్‌కి పేరు రావడం, అతనికి హోదా రావడం, దేవదాసీ వ్యవస్థను కమర్షియల్‌ ఫార్మాట్‌లో ఇంక్లూడ్‌ చేయడం బావుంది.

ఆర్ట్ డిపార్ట్ మెంట్‌ కృషిని మెచ్చుకోవాలి. లొకేషన్లు కూడా కొత్తగా అనిపించాయి. నవరాత్రుల సందర్భంగా దేవదాసీలు ఆలయ ప్రాంగణంలో చేసే నృత్యం, ఒక్కో రోజు వాళ్ల అలంకరణ, కాస్ట్యూమ్‌ స్పెషల్‌గా అనిపిస్తాయి. సాయిపల్లవితో పాటు డ్యాన్సర్లు కూడా చక్కగా నృత్యం చేశారు. ఇలాంటి కొన్ని సన్నివేశాల్లో నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరమీద కనిపించింది. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మిని ప్రస్తావించి, స్ఫూర్తిని నింపే మాటలు చెప్పడం బావుంది. క్లైమాక్స్ కూడా ఊహాతీతం. కీలక సన్నివేశాలను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బావుండేది. ఒక్క అక్షరం లక్షల మెదళ్లను కదిలిస్తుందన్న శ్యామ్‌ సింగరాయ్‌ నమ్మకం, బెంగాలీలోనూ, తెలుగులోనూ ఆయన రచనలు చేయడం, వాటికి శ్రీశ్రీ అభినందన పత్రాన్ని పంపడం వంటి డీటైల్స్ కొన్ని మెప్పిస్తాయి.


No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments