సీఐడీ అధికారులకు చంద్రబాబు లేఖ
తెలుగుదేశం అధినేత చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తామని సీఐడీ అధికారులు ప్రకటించారు.
చంద్రబాబు తరఫు న్యాయవాదులను పోలీసులు సిట్ కార్యాలయంలోకి అనుమతించలేదు. ప్రభుత్వ న్యాయవాదులను అనుమతించి.. చంద్రబాబు లాయర్లను నిలిపివేయడంపై తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్వొకేట్లను ఏ నిబంధనల ప్రకారం ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తన న్యాయవాదులను కలిసేందుకు అనుమతించాలని చంద్రబాబు సీఐడీ అధికారులకు లేఖ రాశారు. న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు, ఎం.లక్ష్మీనారాయణ, శరత్ చంద్రను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు వద్ద సిద్ధంగా ఉన్నారు.
20 ప్రశ్నలతో చంద్రబాబును CBCID అధికారులు విచారిస్తున్నారు. తన లాయర్లతో మాట్లాడిన తర్వాత సమాధానం చెబుతానని చెప్పారు చంద్రబాబు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment