Chandrayaan 3: చంద్రుడిపై 8 మీటర్లు ప్రయాణించిన రోవర్
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్ కదలికలను ధృవీకరించబడ్డాయని ఇస్రో ప్రకటించింది. రోవర్ దాదాపు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని ట్వీట్ చేసింది. ప్రస్తుతం రోవర్ పేలోడ్ లు, LIBS,APXS లను ఆన్ చేసినట్లు ఇస్రో తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్ లోని అన్ని పేలోడ్ లు పనిచేస్తున్నాయని వెల్లడించింది.
అంతకుముందు చంద్రుడిపై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 రోవర్ సులభంగా దిగేందుకు ర్యాంప్ సహాయపడిందని ఇస్రో వీడియో రిలీజ్ చేసింది. అలాగే సోలార్ ప్యానెల్ రోవర్ కు శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించిందని వివరించింది. ల్యాడర్ నుంచి రోవర్ బయటకు వచ్చే టప్పుడు ర్యాంప్, సోలార్ ప్యానెల్ ఎలా పనిచేశాయో ఈ వీడియోలో స్పష్టం కనిపిస్తోంది. చంద్రయాన్ 3 మిషన్ లో 26 యంత్రాంగాలను బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో (URSC)తయారు చేశారని ఇస్రో ట్వీట్ చేసింది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment