Omicron : భారత్‌లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదు
జామ్‌నగర్ :
భారత్‌ను ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా.. తాజాగా దేశంలో మూడో ఒమిక్రాన్ కేసు నమోదైంది. గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో ఓ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు. సదరు వ్యక్తి రెండు రోజుల క్రితం జింబాంబ్వే నుంచి జామ్‌నగర్‌కు రాగా.. విమానాశ్రయం వద్ద అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. తాజాగా వాటి ఫలితాలు విడుదలయ్యాయి. అతడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టడి చర్యలపై దృష్టి పెట్టారు.
మరోవైపు వేరే దేశాల నుంచి భారత్‌లో దిగిన కొందరి ఆచూకీ అధికారులకు చిక్కకపోవడం ఇప్పుడు
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment