Breaking

Search Here

02 December 2021

పాటల మాంత్రికుడికి హరీష్‌ రావు నివాళి.. పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి సీతారామ శాస్త్రి

 


Sirivennela: 

పాటల మాంత్రికుడికి హరీష్‌ రావు నివాళి.. పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి సీతారామ శాస్త్రి అంటూ..

Sirivennela: తన మాటలతో జనాల మనసులను మాయచేసిన పాటల మాంత్రికుడు సిరివెన్నల సీతరామశాస్త్రి మరణ వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్యం కారణంగా

Sirivennela: పాటల మాంత్రికుడికి హరీష్‌ రావు నివాళి.. పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి సీతారామ శాస్త్రి అంటూ

Sirivennela: తన మాటలతో జనాల మనసులను మాయచేసిన పాటల మాంత్రికుడు సిరివెన్నల సీతరామశాస్త్రి మరణ వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకున్న సీతరామశాస్త్రి మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతిసంస్కారాలు నిర్వహించే ముందు ఆయన పార్ధివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిమ్‌ నగర్‌లోని ఫిలిమ్‌ ఛాంబర్‌లో ఉంచారు. ఈ క్రమంలోనే సిరివెన్నెలను కడసారి చూసుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలతో పాటు పలువురు రాజకీయ నాయకులు సైతం క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలంతా ఫిలిమ్‌ నగర్‌ చేరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ మంత్రి హరీష్‌ రావు కూడా ఫిలిమ్‌ చాంబర్‌ వచ్చారు. సిరివెన్నెల పార్ధివ దేహాన్ని సందర్శించుకున్న హరీష్‌ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘సిరి వెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు. పండితులను, పామరులను మెప్పించగలిగిన గొప్ప వ్యక్తిక్తం సిరివెన్నెల సొంతం. సినిమా రంగ పాటలైనా అశ్లీలత, దంద్వ అర్థాలకు తావు లేకుండా పాటలు రచించారు. తెలుగు సినిమా రంగంలో సీతరామ శాస్త్రి గారు తెలియని వారు ఉండరు. సినిమా పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన గొప్ప వ్యక్తి అతను. ఆయన మరణం మనందరికీ ఎంతో దుఃఖాన్ని కలిగించింది. సీతరామ శాస్త్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.

Sirivennela: 

సాహితీ లోకానికి సిరివెన్నెల మిగిల్చిన చివరి గుర్తులు ఇవే.. సీతరామశాస్త్రి రాసిన చివరి పాట ఏంటో తెలుసా.?

Sirivennela Seetharama Sastry: 

వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ త్రివిక్రమ్‌ పాటను ఇష్టపడుతుంటారు. ఈతరం యువకులు కూడా సిరివెన్నెల రాసిన పాటల్లోని అర్థాలను వెతికే ప్రయత్నం...

Sirivennela: 

సాహితీ లోకానికి సిరివెన్నెల మిగిల్చిన చివరి గుర్తులు ఇవే.. సీతరామశాస్త్రి రాసిన చివరి పాట ఏంటో తెలుసా.?

Sirivennela Seetharama Sastry: 

వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ త్రివిక్రమ్‌ పాటను ఇష్టపడుతుంటారు. ఈతరం యువకులు కూడా సిరివెన్నెల రాసిన పాటల్లోని అర్థాలను వెతికే ప్రయత్నం చేస్తారంటేనే ఆయన కలానికి ఉన్న గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాస్త నిరాశ కలిగిందంటే చాలు సిరివెన్నెల రాసిన ఓ స్ఫూర్తిదాయక పాట వినాలనిపిస్తుంది. జోష్‌లో ఉంటే ఆయన రాసిన యూత్‌ఫుల్‌ సాంగ్‌ వినాల్సిందే. ఇలా సిరివెన్నెల పాట సినీ ప్రేక్షకులతో నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అలాంటి పాటల మాంత్రికుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లాడాన్న నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపై సిరివెన్నెల నుంచి పాటలు రావనే నిజాన్ని నమ్మలేకపోతున్నారు.

నిజానికి సిరివెన్నెల పాటలు రాశారు అంటే సినిమాకు వెళ్లేవారు ఉన్నారడనంలో ఎలాంటి సందేహం లేదు. మాస్‌ పాట అయినా, క్లాస్‌ పాట పాయినా, ప్రేమ గీతమైనా.. ఆయన కలం నుంచి జాలు వారితే అది ఒక అద్భుతమే అవుతుంది. ఇదిలా ఉంటే సిరివెన్నెల కలం నుంచి వచ్చిన చివరి పాట ఏంటన్న దానిపై ఇప్పుడు ఆయన అభిమానులు సెర్చ్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి విడుదలైన సిరివెన్నెల చివరి పాటగా ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రంలోని దోస్తీ పాట నిలిచింది. ఈ పాటతో.. 66 ఏళ్ల వయసులోనూ తన కలం పదును ఏమాత్రం తగ్గలేదని చాటి చెప్పారు సిరివెన్నెల.

ఇదిలా ఉంటే సిరివెన్నెల రచన అందించి ఇంకా విడుదల కానీ చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. ఈ లెక్కన చూసుకుంటే సిరివెన్నెల సాహితి లోకానికి ఇచ్చిన చివరి బహుమతి శ్యామ్‌ సింగరాయ్‌ అని చెప్పాలి. ఇదే ఆయన సినీ లోకానికి వదిలి వెళ్లిన చివరి గుర్తు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments