శివ శంకర్ మాస్టర్ జాతకం అలాంటిది! ఇంట్లో అందరూ ఒకటే తిట్లు.. ఆయన జర్నీలో ఆసక్తికర విషయాలు
Shiva Shankar Master Death:
శివ శంకర్ మాస్టర్ ఇకలేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు అని పేర్కొంటున్నారు. అయితే శివ శంకర్.. డ్యాన్స్ మాస్టర్‌గా ఎలా మారారు? ఆయన పట్టుదల ఏంటి? అనే విషయాలను చూస్తే..
శివ శంకర్ మాస్టర్ జాతకం అలాంటిది! ఆయన జర్నీలో ఆసక్తికర విషయాలు
ప్రముఖ కొరియోగ్రఫర్, డాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్ (72) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన.. ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ లోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శివ శంకర్ మాస్టర్ ఇకలేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన మరణం సినీ లోకానికి తీరని లోటు అని పేర్కొంటున్నారు.
ఈ ఆన్‌లైన్ క్విజ్ ఆడుతూ మీ తెలివితేటల్ని పరీక్షించుకోండి
మరి శివ శంకర్.. డ్యాన్స్ మాస్టర్‌గా ఎలా మారారు? ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చాయి? ఆయన పట్టుదల ఏంటి? లాంటి విషయాలను పరిశీలిస్తే ఆయన జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకమని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై మమకారం పెంచుకున్న ఆయన ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరేమనుకున్నా తన టార్గెట్ రీచ్ అయ్యారు. అప్పట్లో ‘సభ’ అనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివ శంకర్ తండ్రి ఓ సభ్యుడు కావడంతో నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి, వాటిపై శివ శంకర్‌కు ఆసక్తి, ఎలాగైనా డ్యాన్స్ చేసి తీరాలనే పట్టుదల పెరిగింది. దాంతో ఆయనంతట ఆయనే డాన్స్ నేర్చుకుని 16ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేసేవారట.
అయితే ఓ రోజు ఆయన డ్యాన్సులు చేస్తున్న విషయం వాళ్ళ నాన్నకు తెలియడంతో చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ బాగా తిట్టారట. అలా అలా ఎలాగో ఎస్సెల్సీ పూర్తి చేశాక ‘తర్వాత ఏం చేస్తావు’ అని శివ శంకర్‌ను అడగడంతో ‘నేను డ్యాన్సు నేర్చుకుంటా’ అని చెప్పారట. ఆ తర్వాత పెద్ద పెద్ద పండితులకు శివ శంకర్ మాస్టర్ జాతకం చూపిస్తే, ‘డ్యాన్సర్ అవుతాడు. వదిలెయ్’ అని చెప్పారట.
ఆ తర్వాత మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద నృత్యం నేర్చుకున్న ఆయన.. ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికించాలి? లాంటి ఎన్నో విషయాలపై పట్టు సాధించారట. అలా కెరీర్ స్టార్ట్ చేసిన శివ శంకర్ మాస్టర్.. వందల చిత్రాలకు డాన్స్ కంపోజ్ చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు గాను ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు కూడా అందుకున్నారు. 10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేసిన
శివ శంకర్ మాస్టర్
మూడు తరాల కథానాయకులతో స్టెప్పులు వేయించారు. నటుడి గానూ మెప్పించారు.
Born: 7 December 1948, Chennai
Died: 28 November 2021
Nationality Indian
Occupation Choreographer, actor
Years active 1975–2021
Spouse(s): Suganya
Children: Vijay Sivasankar, Ajay Sivasankar
Awards: National Film Award for Best Choreography, Nandi Award for Best Choreographer
TV shows: Naga Bhairavi
- K. Sivasankar was an Indian dance choreographer who worked in more than 10 languages but majorly with South Indian films, including Tamil films & Telugu films
No comments:
New comments are not allowed.