Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు
ముంబయి: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అతడు గత నెల దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, దిల్లీ మీదుగా ముంబయి చేరుకున్నాడు. కొవిడ్ పరీక్ష చేయగా ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. అతడు ఇప్పటి వరకు ఎలాంటి కొవిడ్ వ్యాక్సినూ తీసుకోకపోవడం గమనార్హం.
గత నెల 24న అతడు ముంబయి చేరుకున్న తర్వాత అతడికి జ్వరం వచ్చింది. దీంతో పరీక్షలు చేయగా.. ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినట్లు తాజాగా గుర్తించారు. అతడితో పాటు ప్రయాణించిన వారికి పరీక్షలుచేయగా వారందరికీ నెగటివ్‌గా తేలింది.
తాజా కేసుతో కలిపి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.
ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు కేంద్రం వెల్లడించగా.. శనివారం గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అతడు ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment