Breaking

Search Here

07 July 2024

Top Ten News @ 1 PM: టాప్‌ 10 వార్తలు @ 1 PM

Top Ten News @ 1 PM: టాప్‌ 10 వార్తలు @ 1 PM


Top Ten News @ 1 PM: టాప్‌ 10 వార్తలు @ 1 PM


1. టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ లాగిన్‌లోకి వెళ్లి చెక్‌ చేసుకోవచ్చు. తుది కీతో పాటు రిజల్ట్స్‌ను టీజీపీఎస్సీ ఒకేసారి విడుదల చేసింది. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 


2. గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి

గోల్కొండలోని జగదాంబికా అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్దఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.


3. సూరత్‌లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు

సూరత్‌: గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో 15 మందికి గాయాలయ్యాయి. సూరత్‌లోని పాల్‌ ప్రాంతంలో శనివారం ఆరంతస్తుల భవనం కూలింది. శిథిలాల్లో చిక్కుకున్న పలువురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నాయి


4. ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!

పురుగులా తీసిపారేశారు’ ‘పురుగులా చూశారు’ అనే నానుడిలను వినే ఉంటారు. కానీ, ఇప్పుడు మీరు చదవబోయే పురుగు గురించి తెలిస్తే.. మాత్రం మీ అభిప్రాయం మార్చుకొంటారు. మీరు ఎప్పుడైనా రూ.75లక్షల విలువైన కీటకాన్ని చూశారా..? దాని పేరు ‘స్టాగ్‌ బీటిల్‌’. అత్యంత ఖరీదైన పురుగు. ఒక్క రోజులో మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది. 


5. పోటీపై బైడెన్‌ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ () పోటీపై స్వపక్షం నుంచే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బరి నుంచి వైదొలగబోనని ఇప్పటికే ఆయన తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. రేసు నుంచి పక్కకు జరగాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.


6. మందలించారని టీచర్‌నే పొడిచి చంపిన విద్యార్థి

గువాహటి: విద్యాబుద్ధులు నేర్పిన గురువునే కడతేర్చాడు ఓ విద్యార్థి. మార్కులు తక్కువొస్తున్నాయని మందలించినందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాంలోని శివసాగర్‌ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది.  


7. ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్‌డే’ బాయ్‌ రియాక్షన్‌ చూశారా..?

భారత క్రికెట్‌ అభిమానుల హీరో, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ() 43వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అతడి భార్య సాక్షి(Sakshi) సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇందులో ధోనీ కేక్‌ కట్‌ చేసి సాక్షికి అందించిన, అనంతరం ఆమె అతడి కాళ్లు నమస్కరించిన వీడియోను పంచుకొన్నారు.


8. రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్‌..! 

క్రికెట్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లీ () ఇంటర్నెట్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా టీ20 ప్రపంచకప్‌ విజయం తర్వాత సంతోషం పంచుకొంటూ అతడు చేసిన పోస్టు పలు రికార్డులను బద్దలు కొట్టింది. కోహ్లీ-రోహిత్‌ ప్రపంచకప్‌ విజయానందం పంచుకొంటున్న చిత్రం ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.


9. ఒడిశాలో వైభవంగా పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర

ఒడిశాలోని పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా.. పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. గర్భగుడిలోని దివ్య(దారు) విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి.


10. కెరీర్‌కు WWE స్టార్‌ జాన్‌ సీనా గుడ్‌బై.. చివరి పోరు ఎప్పుడంటే?

ప్రముఖ WWE రెజ్లర్‌ జాన్‌ సీనా (John Cena) రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2025లో జరిగే రెసల్‌మేనియా తన చివరి పోటీ అని పేర్కొన్నారు. కెనడాలో జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ మనీ (WWE) ఈవెంట్‌కు హాజరైన సీనా ఆశ్చర్యకరంగా ఈ ప్రకటన చేయడం గమనార్హం. 2001లో రెజ్లింగ్‌లోకి అరంగేట్రం చేశాడు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments