ఐటీ నోటీసుల.. దర్యాప్తు తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ
తాత్కాలిక రాజధాని అమరావతి పేరుతో బడా కంపెనీల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున అయాచిత లబ్ధి పొందారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు. ఆ అక్రమార్జనకుగానూ ఆదాయ పన్ను శాఖ నోటీసులు సైతం అందుకున్నారు కూడా. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన బాబు.. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
సాంకేతిక కారణాలను సాకుగా చూపి చంద్రబాబు ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఒకవైపు సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు పొందారని ఐటీ శాఖ సాక్ష్యాధారాల్ని చూపుతోంది. కానీ, ఐటీ శాఖ సరిగా పరిశీలన చేయలేదని బుకాయిస్తున్నారు చంద్రబాబు. పైగా మనుగడలో లేని ఐటీ నిబంధనలను సాకుగా చూపి దర్యాప్తు ఆలస్యం చేసే ప్రయత్నం చేశారాయన. అయితే..
చంద్రబాబు లేవనెత్తిన టెక్నికల్ అభ్యంతరాలను ఇప్పటికే ఐటీ శాఖ తిరస్కరించింది. దీంతో కేసు మెరిట్స్ లోపలికి వెళ్లకుండా.. మరిన్ని టెక్నికల్‌పాయింట్స్ తెరపైకి తెచ్చి దర్యాప్తు ఆలస్యం చేయడానికి చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మరిన్ని సాకుల కోసం వెతుకుతోంది చంద్రబాబు అండ్ కో.
టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బడా ఇన్‌ఫ్రా కంపెనీలకు అమరావతి ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పి.. వాటి ద్వారా సబ్ కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారాయన. ఆ లెక్క లేని ఆదాయంపైనే ఐటీ శాఖ చంద్రబాబును ప్రశ్నిస్తోంది.
చంద్రబాబుకు నగదు ముట్టినట్లు ఐటీ తనిఖీల్లో క్రిస్టల్ క్లియర్‌గా బయటపడింది. నగదు ఎవరెవరికి ఎలా డెలివరీ అయ్యిందో ఉదాహరణలతో వివరించింది కూడా. దీన్ని బ్లాక్ మనీగా ఎందుకు గుర్తించవద్దో చెప్పాలంటూ చంద్రబాబుకు తాజాగా మరో నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో.. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేశ్‌కు నగదు డెలివరీ అయిన సాక్ష్యాన్ని పట్టుకుంది ఐటీ శాఖ. ఐటీ నోటీసులపై దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు డెక్కన్ క్రానికల్ ఒక కథనం ప్రచురించింది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment