ODI World Cup 2023:
రోహిత్ దూకుడుకు కోహ్లీనే కారణం.. ఔటైనా అతను ఉన్నాడనే నమ్మకం: ఆశీష్ నెహ్రా
సొంతగడ్డపై జరగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో భారత స్టార ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టుకు మెరుపు ఆరంభాలు ఇస్తుంటే.. కోహ్లీ భారీ స్కోర్లు చేసేందుకు దోహద పడుతున్నారు. ఈ తరుణంలో వీరిద్దరిపై భారత దిగ్గజ పేసర్ ఆశిష్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించారు.
వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్, కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారని కొనియాడిన నెహ్రా.. వీరిద్దరి సక్సెస్‌కు వారి మధ్య ఉన్న సమన్వయమే కారణమని తెలిపారు. ఒకరు దూకుడుగా ఆడితే మరొకరు నెమ్మదిగా ఆడటానికి ప్రయత్నిస్తుంటారని నెహ్రా వెల్లడించారు.
"ఈ టోర్నీలో రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్‌లో విరుచుకుపడుతున్నాడు. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను బెంబేలేత్తిస్తున్నాడు. అందుకు కారణం.. కోహ్లీనే. వెనుక అతను ఉన్నాడనే ధైర్యం, భరోసాతోనే అంత దూకుడుగా ఆడగలుగుతున్నాడు. ఈ ఇద్దరు నాణేనికి బొమ్మ బొరుసు లాంటి వారు.. జట్టు విజయం కలిసి ఆడాలనే తపన వీరిలో బలంగా కనిపిస్తోంది.." అని నెహ్రా తెలిపారు.
అగ్రస్థానంలో కోహ్లీ..
ఈ టోర్నీలో ఇప్పటివరకూ 10 మ్యాచ్‌ల్లో 711 పరుగులతో కోహ్లి టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా.. 550 పరుగులతో రోహిత్ శర్మ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment