Phone Recharge Offer: రూ.2,400 తగ్గింపు.. ఫోన్ రీచార్జ్ చేసుకునే వారికి భారీ డిస్కౌంట్ ఆఫర్
Recharge Offer | ఫోన్ రీచార్జ్ చేసుకోవాలని భావించే వారికి తీపికబురు. అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 2,400 డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.
Mobile Recharge Offer | బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 2,400 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతు వస్తున్న వొడాఫోన్ ఐడియా (Vi) మొబైల్ ఫోన్ యూజర్లకు కళ్లుచెదిరే ఆఫర్ అందుబాటులో ఉంచింది. భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంచింది. మొబైల్ ఫోన్ (Phone) రీచార్జ్‌పై సూపర్ డూపర్ డీల్ సొంతం చేసుకోవచ్చు.
వొడాఫోన్ ఐడియా తాజాగా వీఐ స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా యూజర్లు వారి మొబైల్ రీచార్జ్‌పై ఏకంగా రూ. 2,400 డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఈ తగ్గింపు ఒకేసారి ఉండదు. ప్రతి నెలా డిస్కౌంట్ వస్తుంది. ఇది రెండేళ్ల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. వీఐ హీరో రీచార్జ్ ప్లాన్ ఒకటి ఉంది. దీని ధర రూ. 299. ప్రతి నెలా ఈ ప్లాన్ లేదంటే ఇంత కన్నా ఎక్కువ రేటు కలిగిన రీచార్జ్ ప్లాన్‌తో ఫోన్ రీచార్జ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల వీఐ స్మార్ట్‌ఫోన్ ప్రోగామ్ కింద ప్రతి నెలా రీచార్జ్‌పై రూ. 100 డిస్కౌంట్ వస్తుంది. అంటే వీఐ యూజర్లు ప్రతి నెలా మొబైల్ రీచార్జ్‌పై రూ. 100 ఆదా చేసుకోవచ్చు. ఇలా 24 నెలల కాలంలో రూ. 2,400 ఆదా అవుతాయి. వీఐ యాప్ ద్వారానే ఈ ప్రయోజనం పొందొచ్చు. వీఐ స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ పొందాలంటే యూజర్లు 4జీ లేదా 5జీ ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలి. వీఐ సిమ్ కలిగిన వారి ఫోన్‌ను అప్‌గ్రేడ్ అవ్వాలి. అలాగే ఇతర టెలికం యూజర్లు 4జీ లేదా 5జీ వీఐ సిమ్ కొనాలి.
గత ఆరు నెలలుగా వీఐ సిమ్ వేయని స్మార్ట్‌ఫోన్ కలిగిన వారు వీఐ సిమ్ కార్డు అందులో వేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే కొత్త ఫోన్‌లో వీఐ సిమ్ వేస్తే ఆఫర్ వస్తుంది. సిమ్ వేసిన 24 గంటల్లో కంపెనీనే అర్హత కలిగిన కస్టమర్లకు రూ.2,400 డిస్కౌంట్ రీచార్జ్ ఆఫర్ గురించి తెలియజేస్తుంది. వీరికి ఎస్ఎంఎస్ వస్తుంది. యూజర్లు నెల రోజుల్లో వీఐ హీరో అన్‌లిమిటెడ్ రీచార్జ్ ప్లాన్స్‌లో ఏ ప్లాన్‌తో అయినా రీచార్జ్ చేసుకోవచ్చు. వారికి ఆఫర్ వర్తిస్తుంది. వీఐ యాప్‌లో రీచార్జ్ డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉంటాయి. రీచార్జ్ చేసుకున్న వెంటనే రూ.100 డిస్కౌంట్ కూపన్ వస్తుంది. దీన్ని తర్వాతి రీచార్జ్ సమయంలో రిడీమ్ చేసుకోవచ్చు. ఆటోమెటిక్‌గానే ఇది యాడ్ అవుతుంది.
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment