Breaking

Search Here

04 May 2023

రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్‌ మృతి.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో..

ఈ ప్రమాదంలో అగస్త్య తలకు బలమైన గాయం తగలడంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాదం దాటికి అతను ధరించి ఉన్న హెల్మెట్‌ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. మొదటిసారిగా ఈ సాహసం చేసిన అగస్త్య దుర్మరణం చెందడంతో అతని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.


ఒక చోట అని కాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో రోడ్డు  ప్ర‌మాదాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. రోడ్డు భదత్రకు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. రోడ్డు భ‌ద్ర‌తకు సంబంధించి నిత్యం అధికారులు జాగ్ర‌త్త‌లు చెబుతూ వాహ‌నదారుల్లో అవ‌గాహ‌న కల్పిన్నప్ప‌టికీ రోడ్డు ప్ర‌మాదాలు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం వల్ల తమ జీవితాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టుతున్నారు.


తాజాగా రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్‌ అగస్త్య చౌహాన్ మరణించాడు. ఉత్తరాఖండ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. "తన జడ్‌ఎక్స్‌10ఆర్‌ నింజా సూపర్‌బైక్‌పై గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది."


కాగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నివాసి అయిన అగస్త్య చౌహాన్‌ "ప్రొఫెషనల్‌" బైకర్‌. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే మోటార్‌బైక్‌ రేసింగులో పాల్గొనేందుకు బుధవారం జడ్‌ఎక్స్‌10ఆర్‌ నింజా సూపర్‌బైక్‌పై ఆగ్రా నుంచి బయలుదేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని టప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేకు చేరుకోగానే.. గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని సాధించడానికి ప్రయత్నించాడు. బైక్ వేగంగా దూసుకుపోతున్న సమయంలో అతడు ఒక్క సారిగా తడబడ్డాడు. దీంతో " అగస్త్య బైక్‌ అదుపుతప్పి యమునా ఎక్స్‌ప్రెస్‌వే డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది."


ఈ ప్రమాదంలో అగస్త్య తలకు బలమైన గాయం తగలడంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాదం దాటికి అతను ధరించి ఉన్న హెల్మెట్‌ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. మొదటిసారిగా ఈ సాహసం చేసిన అగస్త్య దుర్మరణం చెందడంతో అతని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.


కాగా అగస్త్యకు ‘PRO RIDER 1000’ అనే యూట్యూబ్ ఛానెల్‌ ఉంది. దీనికి 1.2 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వేగంగా బైక్‌ నడుపుతూ స్టంట్‌లు చేస్తున్న వీడియోలను తన ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేసేవాడు. ప్రమాదం జరగడానికి 16 గంటల ముందు కూడా ఓ వీడియోను అప్‌లోడ్‌ చేశాడు.  వేగంగా వాహనాలు నడపడం ప్రమాదకరం అని తన ప్రతి వీడియోకు హెచ్చరికలు సైతం జారీ చేసేవాడు. చివరికి అదే వేగంతో తన ప్రాణాలు కోల్పోయాడు.

1 comment:

Hello all, if you have any doubt feel free comment

Comments